నాగదేవత ఆలయం
భారతదేశంలో నాగుపామును 'నాగదేవత'గా ఆరాధించి పూజించే సంప్రదాయం అనాదిగా వస్తోంది. ఈ కారణంగానే సాధారణమైన పాముని కొట్టినంత తేలికగా నాగ సర్పాన్ని కొట్టడానికి ఎవరూ సాహసించరు. నాగదోషం జీవితకాలం వెంటాడుతుందనీ, అది వంశాన్ని నిర్వీర్యం చేస్తుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి ఉండటమే ఇందుకు కారణం. అందుకే నాగుపాముని కొట్టడం, అవి నివాసముండే పుట్టలను ధ్వంసం చేయడం వంటివి ఎవరూ చేయరు.
భారతీయుల విశ్వాసం ప్రకారం నాగదేవత సంపదలను ... సంతానాన్ని ఇస్తుంది. ఈ కారణంగానే వారు నాగదేవతను ఎంతగానో ఆరాధిస్తుంటారు. 'నాగులచవితి' ... 'నాగులపంచమి' ... 'సుబ్రహ్మణ్య షష్ఠి' వంటి పర్వదినాల్లో ఉపవాసం ఉండిమరీ పూజలు చేస్తుంటారు. అలాంటి నాగదేవత స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రం మనకి రంగారెడ్డి జిల్లా 'తిరుమలగిరి'లో దర్శనమిస్తుంది.
ప్రాచీనకాలం నుంచి నాగదేవత ఇక్కడ కొలువైన మందిరం బ్రిటీష్ వారి కాలంలో ధ్వంసం చేయబడింది. అయితే నాగదేవత ఆదేశం మేరకు మరలా ఇక్కడ 'జయలక్ష్మి' అనే యోగిని ఆలయాన్ని నిర్మించినట్టు స్థలపురాణం చెబుతోంది. కాలక్రమంలో ఆలయం మరింత అభివృద్ధి చెందింది. ఇక్కడ ఎటు చూసినా నాగ ప్రతిమలు ... వివిధ దేవతా మూర్తుల ప్రతిమలు దర్శనమిస్తుంటాయి.
గర్భాలయంలో నాగదేవత మూలమూర్తి మహా తేజస్సుతో వెలుగొందుతూ వుంటుంది. నిత్య పూజాభిషేకాలతో విలసిల్లుతోన్న ఈ క్షేత్రానికి భక్తుల రద్దీ ఎక్కువగానే వుంటుంది. నాగదేవతకి సంబంధించిన పర్వదినాలతో పాటు, ఇతర పర్వదినాల్లోను విశేష పూజలు నిర్వహిస్తుంటారు.