నదిని రప్పించిన శంకరులు
ఆదిశంకరుల వారు యవ్వనంలోకి అడుగు పెట్టడానికి మునుపే ఎన్నో మహిమలను ప్రదర్శించాడు. అలాంటి వాటిలో పూర్ణానదిని తన ఆశ్రమం చెంతకు రప్పించడం ప్రధానంగా కనిపిస్తూ వుంటుంది. ఆది శంకరుల వారి తల్లి అయిన ఆర్యాంబ ప్రతి నిత్యం ఆశ్రమానికి దూరంగా వున్న పూర్ణానదికి వెళ్లి స్నానంచేసి, పూజాభిషేకాలకు అవసరమైన నీటిని తీసుకుని వస్తుండేది.
అయితే వయసు పైబడుతున్నా కొద్దీ ఆశ్రమానికి నది బాగా దూరమైనట్టుగా ... నీటి కడవ భారమైనట్టుగా ఆమెకి అనిపించసాగాయి. అయినా ఓపిక చేసుకుని ఆమె నదికి వెళ్లి వస్తూ వుండేది. ఓ రోజున ఆశ్రమ ఆవరణలో ధ్యానం పూర్తి చేసిన శంకరులు, నది నుంచి నీటి కడవతో వస్తోన్న తల్లిని చూశాడు. ఆమె రోజూ నదీ స్నానం చేయడానికీ, ఆశ్రమానికి అవసరమైన నీటిని తేవడానికి ఎంత కష్టపడుతుందనేది ఆయనకి అర్థమైంది.
ఆ రాత్రి ఆయన ఆ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచన చేశాడు. వయసు పైబడుతున్న కారణంగా ... అనారోగ్య కారణంగా తనతల్లి నది వరకూ రాలేక పోతోందనీ, అందువలన నదియే ఆశ్రమానికి దగ్గరగా రావాలని ఆయన పూర్ణానదిని ప్రార్ధించాడు. మరునాడు తెలతెలవారుతుండగానే నిద్రలేచిన ఆర్యాంబ, కడవ తీసుకుని హడావిడిగా నదికి బయలుదేరింది. ఆశ్రమం బయటికి వచ్చిన ఆమె ఒక్కసారిగా ఆనందాశ్చర్యాలకి లోనైంది.
ఆశ్రమానికి అతి సమీపంగా ప్రవహిస్తున్న పూర్ణా నదిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. తన వైపు నవ్వుతూ చూస్తున్న శంకరులను చూడగానే ఆమెకి విషయం అర్థమైంది. కన్నతల్లి కోసం నదీమ తల్లిని రప్పించిన ఆయన్ని ఆప్యాయంగా అక్కున చేర్చుకుంది. ఆమె మనసులో అపారమైన వాత్సల్యం పొంగుకోస్తూ వుండగా, కళ్ళు ఆనంద బాష్పాలను వర్షించసాగాయి.