విజయదశమి పూజా ఫలితం
దేవీ నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత వుంది ... మరెంతో ప్రాధాన్యత వుంది. ఇక నవరాత్రుల తరువాత జరిగే దశమి పూజ ఎంతో విశిష్టమైనదని పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈ విజయదశమి పూజను ఎప్పుడు .. ఎలా చేయాలనే విషయంలో ఒక్కోసారి సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుంటుంది.
శాస్త్రం మాత్రం ఏ రోజు మధ్యాహ్ననానికి విజయదశమి తిథి వుంటుందో, ఆ రోజునే విజయదశమిగా భావించి అమ్మవారిని పూజించాలని చెబుతోంది. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించాలి. పూజా మందిరంలోని అమ్మవారిని వివిధ రకాల పూలతో ... ఆభరణాలతో అలంకరించాలి. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. పూర్ణపు బూరెలు .... మినపగారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ఉద్వాపన పేరుతో అమ్మవారి పీఠాన్ని కదిలించే సమయంలో మాత్రం, నైవేద్యంగా పెరుగన్నం పెట్టాలి.
విజయదశమి రోజంతా కూడా దీపారాధన ఉండేలా చూసుకోవాలి. ఆ సాయంత్రం 'సీమోల్లంఘనం' పేరుతో ఊరు పొలిమేరదాటి, జమ్మి చెట్టును పూజించాలి. విజయదశమి తిథి ప్రారంభమైన దగ్గర నుంచి ఎనిమిది గంటల తరువాత వచ్చే నలభై ఎనిమిది నిమిషాల కాలం విశేషమైనదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ సమయంలో అమ్మవారు 'అపరాజితాదేవి'గా అనుగ్రహిస్తూ వుంటుంది కనుక, కొత్త కార్యాలకు శ్రీకారం చుట్టాలని అంటారు.
విజయదశమి రోజున సమయం ... నియమం తెలుసుకుని అమ్మవారిని ఆరాధించడం వలన, శత్రుభయం ... అపమృత్యు భయం తొలగిపోతాయి. తలపెట్టిన పనులకు ఆటంకాలు తొలగిపోయి కార్యానుకూలత సిద్ధిస్తుంది. వ్యాధులు ... బాధలు నివారించబడి, నూతన తేజస్సు కలుగుతుంది. అవమానాలు దూరమవుతూ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు ... దోషాలు వైదొలగి సిరిసంపదలు ప్రాప్తిస్తాయి.