శివార్చన ఫలితం
కోరిన వెంటనే భక్తులకు వరాలను ప్రసాదించే కొంగుబంగారం శివుడు. ఆపదలో వున్న వేళ ఆర్తితో పిలిస్తే అమ్మకన్నా ఆత్రంగా పరిగెత్తుకువచ్చే కరుణా సముద్రుడు శివుడు. అలాంటి ఆదిదేవుడిని భక్తులు అనేక విధాలుగా పూజించి తరిస్తుంటారు. స్వయంభువుగా ఆవిర్భవించిన శివుడిని ... ద్వాదశ జ్యోతిర్లింగాలను ... పూజించడం వలన విశిష్టమైన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.
ఇక మహర్షులు ప్రతిష్ఠించిన శివలింగాలను పూజించడం వలన కూడా మహోన్నతమైన ఫలితాలు వస్తాయి. శివలింగం అందుబాటులో లేనప్పుడు పసుముముద్దతో గానీ ... గంధంముద్దతో గాని ... వెన్నముద్దతో గాని... మట్టిముద్దతో గాని ... చివరికి ఆవుపేడతో శివలింగాన్ని చేసి పూజించినా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక శివపూజా సమయానికి ఇవి కూడా లభించని పక్షంలో ... లభించినా పూజకి శరీరం సహకరించని పరిస్థితుల్లో మానసికపూజ చేసుకోవచ్చు.
ఇలా శివలింగాన్ని పూజించడం వలన ఆపదలు ... అపమృత్యు దోషాలు తొలగిపోయి, ఆరోగ్యం ... ఐశ్వర్యం కలుగుతాయి. శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయనీ, భూత .. ప్రేత ... పిశాచ బాధల నుంచి విముక్తి కలుగుతుందనే విషయాలను పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.