శనిత్రయోదశి
శని అనే మాట వినగానే అందరిలోనూ అలజడి మొదలవుతుంది. సాధారణ మానవులే కాదు, దేవతలు సైతం ఆయనంటే భయపడుతుంటారు ... ఆయన బారిన పడుతుంటారు. శనికి శనివారమంటే ఎందుకు ఇష్టమో ... శని త్రయోదశి రోజునే ఆయనను ఎందుకు పూజించాలనే సందేహం కొంతమందికి కలుగుతూ వుంటుంది.
సూర్యుడు - సంజ్ఞాదేవి దంపతులకు వైవస్వతుడు - యమధర్మరాజు జన్మించారు. ఆ తరువాత సూర్యుడి వేడి భరించలేని సంజ్ఞాదేవి, తన నీడకి ప్రాణం పోసి పుట్టినింటికి వెళ్లిపోయింది. ఆ నీడయే ఛాయాదేవి. సూర్యుడి వలన ఆమె సావర్ణి మనువుకు ... శనీశ్వరుడికి జన్మనిచ్చింది. వైశాఖ మాసంలో త్రయోదశిన శని జన్మించాడు. ఆయన పుట్టిన రోజు ... శనివారంగా ప్రసిద్ధి చెందింది.
ఈ కారణంగానే శనివారంతో కూడిన త్రయోదశి రోజున శనికి పూజలు చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టి, నువ్వుల నూనెతోనే ఆయనకి అభిషేకం చేయాలి. నువ్వుల నూనెతో చేసిన వంటకాలనే శనికి నైవేద్యంగా సమర్పించాలి. నువ్వులను ... నల్లని వస్త్రాలను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. శని వాహనమైన కాకికి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి.
ఈ విధంగా చేయడం వలన దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. ఇక ఏలినాటి శనితో బాధపడుతున్న వారు వరుసగా 13 శనివారాలు శనిదేవుడిని పూజించడం వలన, ప్రతి శనివారం హనుమంతుడికి సిందూరాభిషేకం చేయించడం వలన మంచి ఫలితం ఉంటుందని శాస్త్రం తెలియజేస్తోంది.