పేరువెనుక ప్రయోజనం
భారతీయుల ఆచార వ్యవహారాలను పరిశీలిస్తే, 'నామకరణోత్సవం' అనే వేడుకకు ఎంతో ప్రాముఖ్యత వుంది. తమ పిల్లలకు పేరు పెట్టడమనే కార్యక్రమాన్ని బంధుమిత్రుల సమక్షంలో ఒక పండుగలా చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ దేవాలయాల్లో జరిపే ఈ వేడుక, ఆచార వ్యవహారాలను అనుసరించే కొనసాగుతూ వుంటుంది.
ఆధునిక కాలంలో పిల్లలకు పేరు పెట్టడమనేది పెద్దపనిగా మారింది. తమ పిల్లలకు మంచి పేరు పెట్టడం కోసం తల్లిదండ్రులు నానాతంటాలు పడుతుంటారు. తమ పిల్లల పేరు కొత్తగా అనిపించేలా ఉండాలనే ఉద్దేశంతో ఆ దిశగా ఆలోచిస్తుంటారు. ఈ విషయంలో బంధుమిత్రుల సలహాలు ... సూచనలు కూడా తీసుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో అర్థంలేని పేర్లు ... అయోమయానికి గురిచేసే పేర్లు చాలా పుట్టుకొస్తున్నాయి.
సాధారణంగా పిల్లలు పుట్టిన మాసాన్ని బట్టి ... నక్షత్రాన్ని బట్టి పేర్లు పెడుతుంటారు. వ్యవహార నామంగా తమకి నచ్చిన పేరు ... పూర్వీకుల పేరు కలిసివచ్చేలా పేరు పెడుతుంటారు. అయితే పేరు ఏదైనా అది నాలుగు అక్షరాలకి మించి ఉండకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆడపిల్లలకు నదుల పేర్లు గానీ, తిథుల ... నక్షత్రాల పేర్లు గాని పెట్టకూడదని అంటోంది.
ఎవరు ఏ పేరు పెట్టుకున్నా ఆ పేరుగలవారు తమ పేరు ఎక్కడో ఒకచోట రాసే అవసరం వస్తూనే వుంటుంది. అలాగే వారిని ఎంతో మంది పేరు పెట్టి పిలుస్తుంటారు. పేరు పెట్టుకున్నవారికి ... పిలిచే వారికి పుణ్యం లభించాలనే ఉద్దేశంతోనే పూర్వం ప్రతి ఒక్కరూ తమ సంతానానికి దేవుళ్ల పేరు పెట్టేవారు.
పేరు అందంగా వుండటం ... పిలిస్తే పలకడమేగా దాని ప్రయోజనం అని కొంతమంది అనుకుంటూ వుంటారు. కానీ పేరు అనేది దైవానికి సంబంధించినదై .... ఆ పేరు రాసిన వారికి ... పిలిచిన వారికి పుణ్యం లభించేది అయినప్పుడే దాని అసలు ప్రయోజనం నెరవేరుతుందని శాస్త్రం చెబుతోంది.