రామప్ప దేవాలయం
ఓ వైపున చారిత్రక నేపథ్యం ... మరో వైపున ఆధ్యాత్మిక వైభవం కలిగిన క్షేత్రాలు మరింత విశిష్టమైన స్థానంలో విలసిల్లుతుంటాయి. అలాంటి అరుదైన పుణ్య క్షేత్రాల్లో 'రామప్ప దేవాలయం' ఒకటి. ఇటు ప్రకృతి సౌందర్యాన్ని ... అటు శిల్ప సౌందర్యాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే ఈ క్షేత్రం వరంగల్ జిల్లా 'పాలంపేట్' లో దర్శనమిస్తుంది. శివలింగం ఆకారంలో రాతిపలకలు ఒకదానిపై ఒకటి పేరుస్తూ నిర్మించబడిన ఈ క్షేత్రం నాటి నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తూ వుంటుంది.
క్రీ.శ.1213 లో కాకతీయ ప్రభువైన 'రేచర్ల రుద్రుడు' నిర్మించిన ఈ ఆలయంలో తొమ్మిది అడుగుల ఎత్తులో 'శ్రీ రామలింగేశ్వరుడు' లింగరూపంలో కొలువై ఉంటాడు. శివలింగాలను ... నందీశ్వరుల ప్రతిమలను రూపొందించడంలో కాకతీయులు తమదైన ముద్రను ప్రకటించారు. ఈ కారణంగానే ఇవి ఎంతో సౌందర్యాన్ని ... మరెంతో తేజస్సును ఆవిష్కరిస్తుంటాయి. ఇదే విషయాన్ని ఈ క్షేత్రం మరోమారు నిరూపిస్తుంది.
ఈ ఆలయాన్ని 'రామప్ప' అనే శిల్పి తన శిష్య బృందంతో కలిసి 40 సంవత్సరాల పాటు శ్రమించి శిల్పకళా శోభితంగా మలిచాడు. ఇక్కడి ఆలయంలోని ప్రాకారాలపై ... స్తంభాలపై ... పైకప్పు పై ... లోకప్పుపై ... ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి రాయి ఒక శిల్పంగా జీవంతో తొణికిసలాడుతూ కనిపిస్తుంటాయి. పురాణ గాధలతో పాటు చెక్కబడిన అప్సరసలు ... గంధర్వ కన్యలు ... నాగకన్యల ప్రతిమలు అపురూప సౌందర్యానికి నిర్వచనంగా నిలుస్తుంటాయి.
స్వామి వారికి ఎదురుగా ప్రత్యేక మంటపంలో 'నందీశ్వరుడు' కొలువై ఉంటాడు. నందీశ్వరుడికి అలంకరణగా రాయిలోనే చెక్కిన ఆభరణాలు ఆశ్చర్యచకితులను చేస్తాయి. గర్భాలయానికి ముందు వైపున గల ప్రాంగణంలో ఒక వైపున 'కామేశ్వరుడు' ... మరో వైపున 'కాటేశ్వరుడు' కొలువై ఉండేవారట. ఇప్పుడా ఆలాయాలు శిధిలమై కనిపిస్తుంటాయి. ఇక్కడి శివుడు మహిమాన్వితుడే అయినప్పటికీ, ఆయన అనుగ్రహంతోనే ఈ క్షేత్రం శిల్పి పేరుతో ప్రసిద్ధి చెందినట్టుగా చెబుతారు.
20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మూడు రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునే వారి సంఖ్య ఎక్కువగానే వుంటుంది.