మల్లవరం శ్రీనివాసుడు
వైకుంఠములో లక్ష్మీ సమేతంగా కొలువై వుండే శ్రీమన్నారాయణుడు, తన భక్తులను అనుగ్రహించడం కోసం భూలోకంలోని వివిధ ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. ఆయన అవతరించిన అన్ని ప్రదేశాలు పవిత్ర పుణ్య క్షేత్రాలుగా విలసిల్లుతూ, అశేష భక్త జనకోటిచే నిత్య నీరాజనాలు అందుకుంటున్నాయి. అలాంటి పుణ్యక్షేత్రాలలో ప్రకాశం జిల్లాకి చెందిన 'మల్లవరం' ఒకటిగా చెప్పొచ్చు.
రెడ్డిరాజుల కాలంలో అనవేమారెడ్డి సోదరుడైన మల్లారెడ్డి పేరు మీద ఏర్పడిన గ్రామం కనుక ఈ ఊరుకి మల్లవరం అనే పేరు వచ్చింది. గుండ్లకమ్మ నదీ తీరంలోని ఈ గ్రామంలో స్వామివారు ఆవిర్భవించడానికి వెనుక బలమైన కారణం లేకపోలేదు. పూర్వం స్వామివారు ఆకాశయానం చేస్తూ ఇక్కడి కొండపై కాసేపు విశ్రాంతి తీసుకున్నాడట. తనపై నిత్యనివాసం చేయవలసిందిగా ఈ కొండ కోరడంతో, త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుందని చెప్పి స్వామి సెలవుతీసుకున్నాడు. ఆ తరువాత కాలంలో నారదమహర్షి స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు చెబుతారు.
విశాలమైన కొండ పైభాగంలో తీర్చిదిద్దినట్టుగా కనిపించే ఆలయ నిర్మాణం మనసు దోచుకుంటుంది. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు రాజగోపురానికి చెరో వైపున హనుమంతుడు ... గరుత్మంతుడు కొలువై వుంటారు. అందంగా ... అద్భుతంగా మలచిన ఈ ప్రతిమలు చూపరులను కట్టిపడేస్తాయి. శ్రీ కృష్ణదేవరాయలచే నిర్మించినట్టు చెబుతోన్న ఈ రాజగోపురం గత చరిత్రకు ... ఘనకీర్తికి నిలువుటద్దంగా కనిపిస్తుంటుంది.
ఇక గర్భాలయంలో స్వామివారు ... ఆ పక్కనే గల మందిరంలో పద్మావతి అమ్మవారు కొలువుదీరి కనిపిస్తుంటారు. ఇక్కడి పద్మావతీ సమేత శ్రీనివాసుడిని పూజించడం వలన ఆపదలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, ప్రతి నెలా పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిన ప్రత్యేక పూజలు ... భజనలు ఘనంగా నిర్వహిస్తుంటారు.
విశేషమైన పుణ్య తిథుల్లో వివిధ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. తమకి అండదండగా నిలుస్తోన్న స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ స్థాయికి తగినట్టుగా కానుకలు సమర్పించుకుంటారు.