పొన్నై వినాయగార్ క్షేత్రం
ఏకాదశ వినాయక క్షేత్రాల్లో ఒకటిగా తమిళనాడులోని 'పొన్నై' క్షేత్రం అలరారుతోంది. సాధారణంగా వినాయక క్షేత్రాల్లో స్వామివారు సిద్ధి - బుద్ధి సమేతంగా, లేదంటే లక్ష్మీ సమేతంగా దర్శనమిస్తుంటాడు. అలా కాకుండా రాహు - కేతువులతో కలిసి వినాయకుడు పూజలు అందుకుంటూ వుండటం ఇక్కడి ప్రత్యేకత.
ఇక ఏ క్షేత్రానికి వెళ్ళినా ముందుగా అక్కడున్న వినాయక స్వామికి నమస్కరించుకుని మిగతా దేవతా మందిరాలకు వెళుతుంటాం. కానీ ఇక్కడ నవగ్రహాలను దర్శించుకున్న తరువాతే వినాయకుడి దర్శనం చేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. నవగ్రహాలు సతీ సమేతంగా ప్రత్యేక మందిరాలలో కొలువుదీరి కనిపిస్తుంటారు. ఇక రాహు - కేతు పూజలు కూడా ఇక్కడ జరుగుతుంటాయి. శ్రీకాళహస్తి తరువాత ఆ స్థాయిలో ఈ పూజలు ఇక్కడే ఎక్కువగా జరుగుతుంటాయని చెబుతుంటారు.
ఆలయ ముఖమంటపంలో వివిధ రూపాల్లోని గణపతి ప్రతిమలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. గర్భాలయంలో స్వయంభువు వినాయక స్వామితో పాటు రాహు- కేతువులు కొలువై వుంటారు. స్వయంభువు వెనుక భాగంలో వినాయక స్వామి ప్రతిష్ఠిత విగ్రహం కనిపిస్తుంది. గ్రహపరమైన దోషాలు గలవారు తమ జన్మ నక్షత్రం రోజున ఇక్కడ స్వామివారికి పూజాభిషేకాలు చేయిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దోషాలు తొలగి పోతాయని భక్తులు భావిస్తుంటారు.
ఇక వినాయక స్వామి సన్నిధానం సమీపంలో ఉమామహేశ్వరుల ఆలయం కూడా దర్శనమిస్తుంటుంది. ఇక్కడి స్వామివారిని దర్శించి ముడుపుకడితే సంతానభాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పార్వతీ పరమేశ్వరులు ... వినాయక స్వామి కొలువుదీరిన కారణంగా, ఈ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ... వినాయక చవితి సందర్భంగా విశేష పూజలు జరుగుతుంటాయి.