చేవేళ్ల వేంకటేశ్వరుడు
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆవిర్భవించిన ప్రాచీన పుణ్య క్షేత్రాల జాబితాలో మనకు 'చేవేళ్ల' కూడా కనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లాలోని ఈ ప్రాచీన పుణ్యక్షేత్రం తరతరాలుగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. పూర్వం 'మాండుక మహర్షి' స్వామివారి అనుగ్రహాన్ని కోరుతూ ఈ ప్రదేశంలో తపస్సు చేశాడు. ఆయన అభ్యర్ధన మేరకు స్వామివారు ఈ ప్రదేశంలో ఆవిర్భవించాడని స్థల పురాణం చెబుతోంది.
ఆ తరువాత కాలంలో ఇప్పుడు పుష్కరిణిగా పిలవబడుతోన్న సరస్సులో స్వామివారి విగ్రహం 'రంగదాసు' అనే భక్తుడికి లభించింది. ఆయన చిన్నపాటి మందిరాన్ని నిర్మించి అందులో స్వామివారిని ప్రతిష్ఠించాడు. 13 వ శతాబ్దం తరువాత ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోగా భీమరాజు అనే మరో భక్తుడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. కాలక్రమంలో అది కూడా దెబ్బతినడంతో, 'తిరుపతి భట్ల' అనే వ్యక్తి గ్రామస్తుల సహాయ సహకారాలతో స్వామివారికి ఆలయాన్ని నిర్మించాడు. నాటి నుంచి దినదిన ప్రవర్ధమానంగా ఆలయం అభివృద్ధి చెందుతూ వస్తోంది.
విశాలమైన ఆలయ ప్రాంగణం ... బారులు తీరిన మంటపాలు ... నాటి నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతోన్న గర్భాలయ విమానం ... పరివారదేవతల మందిరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. గర్భాలయంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువుదీరి వుండగా, మరో ప్రత్యేక మందిరంలో లక్ష్మీదేవి దర్శనమిస్తుంటుంది. హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, శివాలయం ... నవగ్రహ మంటపం ... ఆళ్వారుల మందిరం కొలువై వున్నాయి.
విశేషమైన పుణ్య తిథుల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో స్వామివారి నిజపాదాలు దర్శనమిస్తుంటాయి. ముందుగా భక్తులు వాటికి ప్రదక్షిణా నమస్కారాలు తెలుపుకుని లోపలికి అడుగు పెడతారు. ఈ కారణంగా ఇక్కడ అడుగు పెట్టడంతోనే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు భావిస్తుంటారు ... తమ కష్టనష్టాలను ఆ లక్ష్మీ శ్రీనివాసుడే తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.