పొన్నూరు భావనారాయణుడు
ఒకే రాత్రిలో దేవతలు నిర్మించినవిగా చెప్పబడుతోన్న 'పంచభావనారాయణస్వామి క్షేత్రాలు' ఎంతో ప్రసిద్ధి చెందాయి. 'సర్పవరం' ... 'పట్టిసీమ' ... 'భావదేవరపల్లి' ... 'బాపట్ల'తో పాటు 'పొన్నూరు' కూడా ఈ అదృష్టానికి నోచుకుంది. ఇక్కడ కొలువైన భావనారాయణ స్వామి వారిని భక్తులు సాక్షి భావనారాయణ స్వామి గా కొలుచుకుంటూ వుంటారు. స్వామివారికి ఈ పేరు రావడానికి వెనుక ఒక ఆసక్తికరమైన కథ వుంది.
పూర్వం కేశవయ్య అనే ఓ వ్యక్తి తన మేనల్లుడైన గోవిందుడిని వెంటబెట్టుకుని కాశీ వెళ్లాడు. తనకి సంతానాన్ని అనుగ్రహించమని అక్కడి నారాయణస్వామిని ప్రార్ధించాడు. ఆడపిల్లపుడితే తనకి ఇచ్చి పెళ్లి చేయవలసిందిగా మేనల్లుడు కోరడంతో అందుకు కేశవయ్య సరేనని చెప్పాడు. ఆ తరువాత కేశవయ్యకి ఆడపిల్ల పుట్టడం ... ఆమెకి 'అక్కలక్ష్మి' అని నామకరణం చేయడం ... ఆమె పెళ్లీడుకి రావడం జరిగిపోయాయి.
అక్కలక్ష్మిని తనకి ఇవ్వడానికి కేశవయ్య అయిష్టతను వ్యక్తం చేయడంతో, గోవిందుడు కాశీ చేరుకొని తనకి జరిగిన అన్యాయం గురించి స్వామికి చెప్పాడు. ఈ విషయంలో సాక్ష్యం చెప్పడానికి రమ్మని కోరడంతో, అతని వెంటే నారాయణస్వామి పొన్నూరుకి చేరుకున్నాడు. కేశవయ్య చేసిన వాగ్దానం గుర్తుచేసి గోవిందుడితో అక్కలక్ష్మి పెళ్లి జరిపించమని అన్నాడు. ఇలా స్వామి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడు కనుకనే అంతా ఆయనను సాక్షి భావనారాయణుడు అని పిలుస్తుంటారు.
వివాహ విషయంలో సాక్ష్యం చెప్పడానికి స్వామివారు ఇక్కడికి వచ్చాడు కనుక, వివాహ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు పడుతున్నవారు ఈ స్వామి దర్శనం చేసుకుంటే ఆ సమస్యలు పరిష్కారమవుతాయని అంటారు. ఇక స్వామి సన్నిధి పక్కనే అమ్మవారు రాజ్యలక్ష్మీ దేవిగా పూజలు అందుకుంటూ వుంటుంది. విశాలమైన ప్రాంగణం ... శిల్ప సౌందర్యం ఉట్టిపడే రాజగోపురం ఆలయ వైభవానికి ప్రతీకగా కనిపిస్తుంటాయి.
ఈ ఆలయ ప్రాంగణంలో విశాలాక్షీ సమేత విశ్వేశ్వరుడు ... చెన్నకేశవ స్వామి ... లక్ష్మీ నృసింహ స్వామి ... వినాయకుడు ... దాసాంజనేయ స్వామి ఆలయాలు దర్శనమిస్తాయి. ప్రతి ఏడాది వైశాఖ మాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు, ఆ స్వామి కృపాకటాక్షాలకు పాత్రులవుతుంటారు.