కురవి వీరన్న క్షేత్రం
శివుడి ఆదేశం మేరకు దక్షప్రజాపతిని సంహరించిన వీరభద్రుడు, అనేక ప్రాంతాల్లో ప్రజల ఇష్టదైవమై పూజలు అందుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో భద్రకాళి సమేతంగా వీరభద్ర స్వామి కొలువైన క్షేత్రం మనకు వరంగల్ జిల్లా 'కురవి'లో దర్శనమిస్తుంది. భద్రకాళీ స్వయంభువుగా వెలసిన ఈ క్షేత్రంలో, చాళుక్య భీముడు స్వామివారికి ఆలయాన్ని నిర్మించగా, ఆ తరువాత వచ్చిన కాకతీయులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేసినట్టు చరిత్ర చెబుతోంది.
గర్భాలయంలో స్వామివారు దశ భుజాలతో వివిధ రకాల ఆయుధాలను కలిగి భద్రకాళీ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. వీరన్నస్వామి సంతానాన్ని ప్రసాదిస్తాడనీ, తమ పిల్లలను సంరక్షిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ కారణంగానే ఈ ప్రాంతంలో చాలామందికి వీరన్న పేరు వుంటుంది. ఆలయ ప్రాంగణంలో సప్త మాతృకలు .. నవగ్రహాలు .. వినాయకుడు .. రామలింగేశ్వరుడు .. చంద్రమౌళీశ్వరుడు కొలువుదీరి కనిపిస్తుంటారు.
కార్తీకమాసంలోను ... మహాశివరాత్రి పర్వదినంలోను స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. భద్రకాళీ ఆశీస్సులను ... వీరభద్రుడి అభయాన్ని పొందుతూ వుంటారు.