చెన్నకేశవ క్షేత్రం
శ్రీమహావిష్ణువు ... శ్రీదేవి - భూదేవి సమేతంగా కొలువుదీరి చెన్నకేశవస్వామిగా పూజలు అందుకుంటోన్న క్షేత్రం మనకి గుంటూరు జిల్లా 'కాకుమాను' లో కనిపిస్తుంది. ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర వుంది. ఎందరో రాజ వంశీకులు ... మహాభక్తులు ఇక్కడి స్వామివారిని సేవించారు. విజయాలను... వీలైనన్ని శుభాలను ఇక్కడి స్వామి ప్రసాదిస్తూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు.
గర్భాలయంలో స్వామి సమ్మోహనాకారం భక్తుల చూపులను కట్టిపడేస్తుంది. స్వామివారికి కుడివైపున శ్రీ వెంకటేశ్వర స్వామి ... ఎడమ వైపున వేణుగోపాల స్వామి కొలువై వుంటారు. మూడవసారి పునఃనిర్మించిన ఆలయంలో ప్రస్తుతం స్వామివారు కొలువై వున్నారు. ఇక ఉపాలయాలుగా హనుమంతుడు ... వినాయకుడు ... నాగదేవత ... శిరిడీ సాయి మందిరాలు దర్శనమిస్తుంటాయి. విశేష పుణ్య తిథుల్లో ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి.
వైశాఖ ... ఆశ్వీయుజ మాసాల్లో పౌర్ణమి తిథుల్లో స్వామివారికి తిరుకల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ వేడుకలను దర్శించి తరించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. స్వామివారి వైభవాన్ని తిలకిస్తూ పరవశించిపోతుంటారు.