జోడుగుళ్లు
'జోడుగుళ్లు' అనే పేరు రాజమండ్రిలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఈ క్షేత్రం ఆవిర్భవించినది ఇక్కడే. శివకేశవుల ఆలయాలు రెండూ పక్కపక్కనే వుండటం వలన ఈ క్షేత్రానికి ఈ పేరు వచ్చింది. ప్రాచీనతను సంతరించుకున్న ఈ క్షేత్రంలో బాలా త్రిపుర సుందరి సమేత శివుడు, బిందుమాధవుడిగా శ్రీ మన్నారాయణుడు శ్రీదేవి - భూదేవి సమేతంగా దర్శనమిస్తుంటాడు.
ఇక శివాలయంలో శివలింగం చిన్నదిగా కనిపించినా ఇది అత్యంత శక్తిమంతమైన క్షేత్రంగా చెప్పబడుతోంది. ఇక్కడి శివయ్యతో భక్తులకు విడదీయరాని అనుబంధం వుంది. ఆయన అనుమతి లేకుండా ... ఆశీర్వాదం లేకుండా వాళ్లు ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టరు. ఇక పంచమాధవ క్షేత్రాలలో ఒకటిగా ఈ బిందుమాధవ క్షేత్రం దర్శనమిస్తుంటుంది. శివయ్యకి బిల్వ దళాలాను సమర్పించిన భక్తులు ... మాధవుడికి తులసి మాలలు సమర్పించుకుంటారు.
పర్వదినాల సమయంలో శివకేశవులు సర్వాంగ సుందరంగా ముస్తాబై భక్తులచే విశేష పూజలు అందుకుంటూ వుంటారు. ఆలయ ప్రాంగణంలో జగదాంబ ... గణపతి ... కుమార స్వామి ... శ్రీ లక్ష్మీనారాయణ స్వామి మందిరాలు కొలువుదీరి వుంటాయి. ఇక్కడి హరిహర క్షేత్రాన్ని దర్శించిన వారికి సంపదలు ... సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.