పట్టిసీమ భావనారాయణుడు
పంచ భావనారాయణ స్వామి క్షేత్రాలలో పట్టిసీమ భావనారాయణ స్వామికి ఎంతో విశిష్టత వుంది. ఇక్కడి భావనారాయణ స్వామికి యుగయుగాల నాటి చరిత్ర వుంది. శ్రీ మన్నారాయణుడి అనుగ్రహాన్ని కోరుతూ జాంబవంతుడు తపస్సు చేయగా, ఈ క్షేత్రంలో భావనారాయణ స్వామిగా అవతరిస్తానని స్వామి మాట ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో కృతయుగంలో స్వామి వైకుంఠంలో అమ్మవారితో ముచ్చటిస్తూ వుండగా, ఒక ఏనుగు ఆర్తనాదం వినిపించింది. దాహం తీర్చుకోవడం కోసం ఒక ఏనుగు సరస్సులోకి దిగగా, దాని కాలును ముసలి గట్టిగా పట్టుకుంటుంది. తన శక్తినంతటిని వుపయోగించి ఆ ఏనుగు దాని బారి నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తోంది. తన శక్తి నశిస్తూ ఉండటంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో శ్రీ మహా విష్ణువును ప్రార్ధిస్తుంది.
ఆ అరుపులోని భావనను బట్టి ఆ ఏనుగు ఎంతగా బాధపడుతుందో శ్రీ మహావిష్ణువు అర్థం చేసుకున్నాడు. ఆ మూగ జీవాన్ని రక్షించాలనే తాపత్రయంతో శంఖు చక్రాలను కూడా మరిచిపోయి కంగారుగా ఆ సరస్సు దగ్గరికి చేరుకొని ఏనుగుకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఆర్తుల మనసులోని భావనను బట్టి వారిని రక్షించే స్వామి కావడంతో భావనారాయణ స్వామిగా భక్తులు కొలుస్తుంటారు.
ఏనుగును కాపాడే హడావిడిలో స్వామి వున్న సమయంలో, నారద మహర్షి ఆయన శంఖు చక్రాలను తీసుకు వచ్చి ఇచ్చాడు. ఏనుగును కాపాడే ఆదుర్దాలో స్వామి వాటిని అపసవ్యంగా ధరించాడు. నేటికీ స్వామి ఇదే ముద్రలో ఇక్కడ దర్శనమిస్తుంటాడు. జాంబవంతుడికి ఇచ్చిన మాటమేరకు స్వామి ఇక్కడ 'దేవకూట పర్వతం' పై శ్రీ భూ నీలాదేవి సమేతుడై వెలిశాడు. ఇలా కృత యుగంలో ఆవిర్భవించిన స్వామి ఎందరో మహర్షులచే ... దేవతలచే పూజలందుకున్నాడు.
కలియుగంలో కూడా ఎందరో మహానీయులచే ఆరాధించబడిన స్వామికి చోళ రాజులు ఆలయాన్ని నిర్మించగా, రెడ్డి రాజులు ఆలయ అభివృద్ధికి కృషి చేశారు. భక్తుల భావనను గ్రహించి వారి కోరికలను స్వామివారు సత్వరమే నెరవేరుస్తాడని స్థానికులు చెబుతుంటారు. ప్రతియేటా స్వామివారికి చైత్ర శుద్ధ ఏకాదశి రోజున కళ్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరిస్తుంటారు.