శ్రీ సుబ్రహ్మణ్యే శ్వర క్షేత్రం
పార్వతీ పరమేశ్వరుల సంతానమైన 'శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి' సర్పాకారంలో జన్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అలా సర్పాకారంలో ఆయన ఆవిర్భవించిన క్షేత్రం కృష్ణా జిల్లా 'శింగరాయపాలెం'లో అలరారుతోంది. పూర్వం ఇక్కడి ప్రదేశంలోని ఓ పుట్టలో ఒక పాము ఉండేదట. ఆ పాము అక్కడ పరిసరాలలలో తిరుగడమే కాకుండా, ప్రతి నిత్యం ఇక్కడి సరస్సులో స్నానం చేస్తూ వుండేది.
ఈ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఆ పాము ఎదురుపడటంతో, వాళ్లు దానిని చంపడానికి ప్రయత్నించారు. ఆ రాత్రి ఆ గ్రామపెద్దకు సుబ్రహ్మణ్య స్వామి కలలో కనిపించి తనకి ఆలయాన్ని నిర్మించమని చెప్పాడు. ఆలయం నిర్మించవలసిన ప్రదేశాన్ని ఆవు సూచిస్తుందని చెప్పి అదృశ్యమయ్యాడు. మరునాడు ఉదయం ఒక ఆవు సరస్సులో స్నానం చేసి ఈ ప్రదేశానికి వచ్చి తన కాళ్లతో నేలను తవ్వడం మొదలు పెట్టింది. స్వామి ఆదేశంగా భావించిన గ్రామస్తులు ఇక్కడ ఆయనకు ఆలయాన్ని నిర్మించారు.
విశాలమైన ఆలయం ... పొడవైన ప్రాకారాలతో ... శిల్పకళా శోభితంగా కనిపిస్తూ వుంటుంది. గర్భాలయంలో స్వామి రాతి పుట్టపై సర్పాకారంలో దర్శనమిస్తుంటాడు. గర్భాలయానికి ఎదురుగా నెమలి వాహనం దర్శనమిస్తూ వుంటుంది. ఇక ఆనాటి పాత పుట్ట చుట్టూ వేదికతో కూడిన మందిరం నిర్మించారు. ఇప్పటికీ కూడా ఇదే పుట్టలో భక్తులు పాలు పోస్తుంటారు. ఇక్కడి స్వామివారిని సేవించడం వలన సర్పదోషం తొలగిపోతుందనీ, సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు.
మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠి రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా 13 రోజులపాటు జరిగే ఉత్సవాల్లో 'రథోత్సవం' ... తెప్పోత్సవం' చూసి తీరవలసిందే. ఈ రోజుల్లో వేలసంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకొని, కానుకలు ... మొక్కుబళ్లు చెల్లించుకుంటూ వుంటారు.