శేష తీర్థం విశిష్టత

శేష తీర్థం విశిష్టత
తిరుమలను భూలోకానికి దిగి వచ్చిన వైకుంఠంగా భక్తులు భావిస్తుంటారు. స్వామి ఆదేశం మేరకు ఈ పర్వత శ్రేణులను గరుత్మంతుడు ... ఆదిశేషుడు ఇక్కడ ఏర్పాటు చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. స్వామివారు స్వయంభువుగా అవతరించిన ఈ క్షేత్రంలో శిలలన్నీ సాలగ్రామాలనీ ... చెట్లన్నీ కల్ప వృక్షాలనీ ... జీవులన్నీ మహర్షులని పేర్కొంటున్నాయి.

ఇంతటి మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని 'సనక సనందన తీర్థం' ... 'పాపనాశన తీర్థం' ... ' పాండవ తీర్థం' ... 'జాబాలి తీర్థం' ... 'కుమారధార తీర్థం' ... 'తుంబుర తీర్థం' ... 'చక్ర తీర్థం' ... 'శేష తీర్థం' మరింత పవిత్రం చేస్తున్నాయి. ఇవి కాకుండా సిద్ధ పురుషులకు మాత్రమే కనిపించే మరెన్నో తీర్థాలు తిరుమలలో వున్నాయని చెబుతుంటారు.

మహర్షులు ఈ తీర్థాలను ధర్మ ప్రదమైనవిగా ... జ్ఞానప్రదమైనవిగా ... భక్తి ప్రదమైనవిగా ... ముక్తి ప్రదమైనవిగా విభజించారు. వీటిలో శేష తీర్థాన్ని జ్ఞాన ప్రదమైన క్షేత్రంగా చెబుతుంటారు. ఈ తీర్థంలో స్నానమాచరించడం వలన జ్ఞానమార్గంలోకి ప్రవేశించడానికి అవకాశం కలుగుతుందనీ, మోక్ష మార్గంలో ప్రయాణించడానికి అవసరమైన దైవానుగ్రహం లభిస్తుందని అంటారు.

More Bhakti Articles