బెజ్జంకి లక్ష్మీ నారసింహుడు
తన భక్తులను బాధిస్తే తాను ఏ మాత్రం సహించనని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే స్వయంగా చెప్పిన విధానం మనకి 'అంబరీషుడు' వృత్తాంతంలో కనిపిస్తుంది. ప్రహ్లాదుడి పట్ల హిరణ్య కశిపుడి ప్రవర్తనను సహించలేని స్వామి, నృసింహ స్వామిగా అవతరించి రాక్షస రాజును సంహరించాడు. అనంతరం ప్రహ్లాదుడి కోరికపై శాంతించిన స్వామి, లక్ష్మీ సమేతుడై అనేక ప్రదేశాల్లో అవతరించాడు. అలా స్వామివారు కొలువుదీరిన మరో విశిష్ట క్షేత్రంగా 'బెజ్జంకి' దర్శనమిస్తుంది.
కరీంనగర్ జిల్లాలోని ఈ క్షేత్రంలో స్వామి గుట్టపై గల గుహలో లక్ష్మీ సమేతంగా కొలువై కనిపిస్తుంటాడు. కాకతీయుల కాలంలో ఓ ప్రభుత్వ అధికారి శిస్తు వసూలు పనిమీద ఇక్కడికి వస్తూ, ధ్యానం చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా భావించి చిన్నపాటి శివాలయం నిర్మించాడు. ఇక్కడ ఆయన ధ్యానం చేస్తుండగా, నృసింహస్వామి కనిపించి తాను కూడా ఇదే క్షేత్రంలో నెలవై ఉన్నట్టుగా చెప్పాడట. దాంతో ఆ అధికారి ఆ పరిసరాలను గాలించి గుహలో ఆవిర్భవించిన లక్ష్మీ నృసింహస్వామిని చూసి ఆలయాన్ని నిర్మించాడు. ఆనాటి నుంచి ఇది హరిహర క్షేత్రంగా అలరారుతోంది.
ఈ ఆలయం బయటికి సాధారణంగానే కనిపించినా లోపలిభాగంలో కాకతీయుల శిల్పకళ ఆశ్చర్యచకితులను చేస్తుంది. గర్భాలయంలో స్వయంభువుగా ఆవిర్భవించిన లక్ష్మీ నృసింహస్వామికి ప్రతి నిత్యం అర్చనాభిషేకాలు జరుగుతుంటాయి. భైరవుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, సంతాన భాగ్యాన్ని కలిగించే స్తంభం ఒకటి కనిపిస్తుంది. సంతానం కోసం ఈ స్తంభాన్ని పూజించే ఆచారం ప్రాచీనకాలం నుంచి వస్తోంది.
విశేషమైనటువంటి పర్వదినాల్లో ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతూ వుంటాయి. బెజ్జంకి నృసింహస్వామిని దర్శించడం వలన కష్టాలు కరిగిపోతాయనీ, వ్యాధులు ... బాధలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.