కొమరవెల్లి మల్లన్న
కాకతీయ ప్రభువులు తమ పరిపాలనా కాలంలో అనేక శైవ క్షేత్రాలను అభివృద్ధి పరిచారు ... మరికొన్నింటిని నిర్మించారు. ఆనాటి వారి శైవభక్తిని ఈనాటికీ ఆ క్షేత్రాలు ఆవిష్కరిస్తున్నాయి. అలాంటి విశిష్టమైన క్షేత్రాల్లో ఒకటిగా 'కొమరవెల్లి' దర్శనమిస్తుంది. మల్లికార్జున స్వామి పూజలు అందుకుంటోన్న ఈ క్షేత్రం వరంగల్ జిల్లా చేర్యాల మండలంలో అలరారుతోంది.
కాకతీయుల పాలనా కాలంలో 'పుట్టమన్ను' తో తయారుచేసిన స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ గుహలో ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకూ విగ్రహానికి పూజలు చేస్తూ వుండటం ... విగ్రహం చెక్కుచెదరక పోవడం విశేషం. చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా ఇక్కడి స్వామిని తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు.
ఇక్కడి ప్రజలు కొత్త మట్టి పాత్రల్లో స్వామివారికి నైవేద్యాలు సమర్పించి, వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఆ మట్టి పాత్రలను పాడి పంటలకు సంబంధించిన పనులకు ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయని వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇక ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టగానే గర్భాలయానికి ఎదురుగా ఒక 'రావిచెట్టు' దర్శనమిస్తుంది. ఈ చెట్టు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించిన దగ్గరనుంచి వుందని చెబుతుంటారు.
ముందుగా ఈ చెట్టుకు ప్రదక్షిణ చేసి, ఒక కొబ్బరికాయను వస్త్రంలో చుట్టి చెట్టుకు కడతారు. ఈ విధంగా చేయడం వలన మనసులోని కోరికలు నెరవేరతాయని అంటారు. ఇక శైవ సంబంధిత పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. మార్గశిర మాసంలో జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు.