వెన్నముద్దల బాలకృష్ణుడు
లోకంలో ప్రతి తల్లి తన బిడ్డలో బాలకృష్ణుడినే చూసుకుంటుంది. తన బిడ్డని బాలకృష్ణుడిగా అలంకరించి మురిసిపోతుంది. పరమాత్ముడైన శ్రీకృష్ణుడు పసివాడిగా పారాడుతూనే అందరి హృదయాలపై అందాల కృష్ణుడిగా ... అల్లరి కృష్ణుడిగా చెరగని ముద్రవేశాడు.
సాధారణంగా కృష్ణాలయం అనగానే అందులో రాధాకృష్ణుడో ... రుక్మిణీ కృష్ణుడో దర్శనమిస్తుంటాడు. ఆ పరంధాముడు బాలకృష్ణుడిగా వెన్నముద్దను చేతబట్టి పారాడుతూ కొలువుదీరిన క్షేత్రాలు దాదాపుగా కనిపించవనే చెప్పాలి. అలాంటి అరుదైన క్షేత్రం మనకి గుంటూరు జిల్లాలోని చెంఘీజ్ ఖాన్ పేటలో దర్శనమిస్తుంది.
శ్రీకృష్ణదేవరాయలు 'కొండవీడు' దుర్గాన్ని జయించిన సందర్భంగా ఇక్కడ ఈ బాలకృష్ణుడిని ప్రతిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది. ముద్దులొలికే చిన్ని కృష్ణుడి రూపాన్ని గురించి కవులు చేసిన వర్ణనలను దృష్టిలో పెట్టుకుని శ్రీకృష్ణదేవరాయలు ఈ విగ్రహాన్ని మలిపించినట్టు చెబుతారు. వెన్నముద్దను చేతబట్టి పారాడుతున్న చిన్ని కృష్ణుడి విగ్రహంలో జీవకళ తొణికిసలాడుతూ వుంటుంది. బాలకృష్ణుడు పారాడుతూ గర్భాలయం దాటి బయటికి వచ్చేస్తాడేమో అనేంతటి చైతన్యాన్ని సంతరించుకుని కనిపిస్తాడు.
చక్కని కనుముక్కుతీరు కలిగిన కన్నయ్య నుంచి దృష్టి మరల్చుకోవడం కష్టమనే చెప్పాలి. ఇంతటి నాజుకుగా మలచిన ప్రతిమ ... నవనీతాన్ని చేతబట్టి పారాడే ముద్దులకృష్ణుడు మరెక్కడా కనిపించడని స్థానికులు చెబుతుంటారు. గర్భాలయానికి ఒక వైపున 'గోపీనాథ స్వామి' ... మరో వైపున 'రుక్మిణీ దేవి' మందిరాలు దర్శనమిస్తాయి. ఆలయ ఆవరణలో క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు ... ఆ పక్కనే పార్వతీ సమేత పరమేశ్వరుడు కనిపిస్తారు. ఈ కారణంగా ఇది శివకేశవ క్షేత్రంగా విశిష్టతను సంతరించుకుంది.
వైష్ణవ సంబంధమైన పర్వదినాల సమయంలో స్వామివారికి విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ సందర్భాల్లో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తుంటారు. నయనమనోహరంగా కొలువుదీరిన నవనీత కృష్ణుడిని దర్శించి వెళుతుంటారు.