పుష్పయాగ ఫలితం
అతివృష్టి - అనావృష్టి బారి నుంచి దేశ ప్రజలను కాపాడమని దైవాన్ని కోరుతూ వివిధ పుణ్యక్షేత్రాలలో 'పుష్పయాగం' నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో జరిగే 'పుష్పయాగం' చూడటానికి రెండు కళ్ళూ చాలవనిపిస్తుంది. ఈ పుష్పయాగం జరిగే తీరు చూస్తే పూల ప్రవాహం స్వామివారిని అభిషేకించడానికి వచ్చిందా అన్నట్టుగా వుంటుంది.
పుష్ప యాగంలో అన్నిరకాల పువ్వులను వాడరు ... శాస్త్రం పేర్కొన్న కొన్ని రకాల పువ్వులు మాత్రమే ఈ అదృష్టానికి నోచుకుంటాయి. ఈ జాబితాలో మనకు తెల్ల కలువలు ... ఎర్ర కలువలు ... మెట్ట తామరలు ... సంపెంగలు ... జాజులు ... పొగడలు ... గన్నేరులు ... మోదుగ పూలు ... నందివర్ధనాలు ... దేవదారు పూలు కనిపిస్తాయి.
ఈ పువ్వులతో జరిగే పుష్పయాగంలో పాల్గొనుట వలన పూర్వీకులు తరిస్తారు. ముందు తరాలవారికి ఉన్నతమైన స్థితి కలుగుతుంది. తెలిసీ తెలియక దైవ సంబంధమైన కార్యక్రమాల్లో చేసిన పొరపాట్ల కారణంగా కలిగిన దోషాలు సమసిపోతాయి. ఈ పుష్పయగాన్ని దర్శించడం వలన సమస్త పాపాలు నశించి, అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రం చెబుతోంది.