రుద్రాక్ష ధారణ - నియమాలు
రుద్రాక్షలను శివ రూపాలుగా భావించి పూజించడం ... ధరించడం అనాదిగా వస్తోంది. సాధారణంగా శివారాధకులలో కొందరు రుద్రాక్షలను మాలగా ధరించగా, మరికొందరు కంఠం వరకు మాత్రమే ధరిస్తుంటారు. ఇంకొందరు ముంజేతికి ... భుజాలకి ధరిస్తుంటారు. ఇక ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా ... ఏ రాశికి చెందిన వారైనా ముందుగా రుద్రాక్షలను మంచి గంధంతో గానీ ... ఆవుపాలతో గాని శుద్ధిచేసి ధరించవలసి వుంటుంది.
రుద్రాక్షలు త్వరగా పాడైపోకుండా ఎక్కువకాలం ఉండాలంటే తరచూ వాటికి ఆవునెయ్యి పూస్తూ వుండాలి. శ్రావణ ... కార్తీక సోమవారాల్లోనూ, పౌర్ణమి ... గ్రహణ సమయాల్లోను రుద్రాక్షను ధరించడం చాలా మంచిదని అంటారు. ఇంతటి మహిమాన్వితమైన రుద్రాక్షను మైల సమయాల్లోనూ ... శుచిగాలేని సమయాల్లోనూ ధరించకూడదని శాస్త్రం చెబుతోంది. జపానికి ... ధారణకి వేరువేరుగా రుద్రాక్షలను ఉపయోగించాలని చెబుతుంటారు.
రుద్రాక్ష జపమాలను ఉదయం వేళలో నాభికి సమానంగా ఉంచాలనీ, మధ్యాహ్నం వేళలో వక్షస్థలానికి సమానంగాను, సాయంత్ర సమయంలో నాశికకు సమానంగా ఉంచాలని అంటారు. ఇలా ఉపయోగించిన రుద్రాక్షలకు ఆరునెలలకి ఒకసారైనా 'ఏకాదశ రుద్రాభిషేకం' చేయాలని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన రుద్రాక్షలు మరింత శక్తిని సంపాదించుకుని ప్రభావాన్ని చూపుతాయనీ, అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తాయని అంటారు.