నెల్లూరు
శక్తిస్వరూపిణి అయిన అమ్మవారు తన భక్తులను అనుగ్రహించడం కోసం వివిధ రూపాల్లో అనేక ప్రాంతాల్లో అవతరించింది. అలా అమ్మవారి అంశావతారమైన శ్రీ రాజరాజేశ్వరీదేవి కొలువైన క్షేత్రం మనకి నెల్లూరులోని 'దర్గమిట్ట'లో దర్శనమిస్తుంది. ప్రాచీనకాలం నుంచి రాజరాజేశ్వరీ అవతారానికి ఎంతో ప్రత్యేకత .... మరెంతో విశిష్టత వున్నాయి. ఎన్నో రాజవంశాల వారు ఆ తల్లిని తమ కులదేవతగా భావించి పూజించిన దాఖలాలు వున్నాయి. మరెందరో మహర్షులు ఆ తల్లి తపోదీక్షలో తరించారు.
దుష్టశక్తుల బారినుంచి తన భక్తులను కాపాడటంలోనూ, కోరిన వరాలను ప్రసాదించడంలోను శ్రీ రాజరాజేశ్వరీదేవి ముందుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో విరాజిల్లుతోన్న ఈ క్షేత్రానికి భక్తులు భారీ సంఖ్యలోనే తరలి వస్తుంటారు. విశాలమైన ఆలయ ప్రాంగణం ... అందమైన రాజగోపురం ... ప్రాకారాలపై కొలువుదీరిన దేవతా ప్రతిమలు ... మనసుదోచే ముఖమంటపం ఈ క్షేత్ర వైభవాన్ని ప్రతిబింబిస్తుంటాయి.
గర్భాలయంలో అమ్మవారు కళకళలాడుతూ కరుణాకటాక్ష వీక్షణాలను భక్తులపై ప్రసరింపజేస్తుంటుంది. ప్రతి శుక్రవారం రాహుకాల సమయంలో భక్తులు ఇక్కడ నిమ్మ దొప్పల్లో నెయ్యి దీపాలు వెలిగిస్తూ వుండటం విశేషం. ఈ విధంగా చేయడం వలన అమ్మవారి అనుగ్రహంతో గ్రహసంబంధమైన దోషాలు తొలగిపోతాయని వాళ్లు విశ్వసిస్తుంటారు. ఇదే ప్రాంగణంలో గాయత్రీ దేవి మందిరం ... నాగ మందిరం ... నవగ్రహ మంటపం దర్శనమిస్తుంటాయి. ఆయా పుణ్య తిథుల్లో భక్తులు ఈ దేవతా మూర్తులను దర్శించుకుని పూజిస్తుంటారు.