మండపాక
జమదగ్ని మహర్షి భార్య అయినటువంటి రేణుకా దేవి, వివిధ ప్రాంతాల్లో రేణుకా ఎల్లమ్మగా పూజలు అందుకుంటోంది. ప్రాచీన కాలం నుంచి గ్రామ దేవతగా తన బిడ్డలను కాపాడుతూ వస్తోన్న రేణుకా ఎల్లమ్మను ... ఎల్లరూ అమ్మగా భావిస్తూ వుండటం వలన 'ఎల్లారమ్మ' గా ప్రసిద్ధి చెందింది. ఎల్లారమ్మగా ఈ తల్లి పూజించబడుతోన్న క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు సమీపంలోని 'మండపాక'లో దర్శనమిస్తోంది.
పూర్వం ఈ ప్రదేశంలో మాండవ్య మహర్షి తపస్సు చేసిన కారణంగా ఈ ఊరికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయంలో అమ్మవారు చతుర్భుజాలతో కళకళలాడుతూ కనిపిస్తుంది. అమ్మవారు ఎంతో మహిమగలదని భక్తులు భావిస్తుంటారు. భక్తులు సమర్పించిన పూవులు అలంకరణలో నుంచి రాలి పడితే, ఆ భక్తుల కోరికలు త్వరలో నెరవేరతాయని విశ్వసిస్తుంటారు.
నిత్య పూజలతో పాటు అమ్మవారికి ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు పెద్ద సంఖ్యలో జరుగుతూ వుంటాయి. ప్రతి ఏడాది చైత్ర మాసంలో అమ్మవారికి ఉత్సవాలు జరుగుతాయి. కనులపండువగా జరిగే ఈ ఉత్సవాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తుంటారు. కాలభైరవుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, అమ్మవారు గ్రామరక్షణ భాద్యతను నిర్వహిస్తూ వుంటుంది. ఇందుకు నిదర్శనాలు ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.