మహబూబ్ నగర్
జీవితం ఆనందంగా...హాయిగా సాగిపోవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఏ మాత్రం ఒడిదుడుకులు ఎదురైనా ఆందోళన చెందుతుంటారు. కలవరపాటుకి గురిచేసే కష్టాలు శని కారణంగానే కలుగుతుంటాయి. అలాంటి శనిదేవుడి అనుగ్రహాన్ని ఆశించే అందరూ ఆయనకి పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. అలాంటి శనీశ్వర క్షేత్రాల్లో విశిష్టమైనదిగా చెప్పబడుతోంది 'నందివడ్డమాను' క్షేత్రం. ఇది మహబూబ్ నగర్ జిల్లాలో దర్శనమిస్తుంది.
పూర్వ కాలంలో ఇక్కడ శివాలయం మాత్రమే వుండేది. శివుడితో పాటు నందీశ్వరుడికి కూడా పూజలు నిర్వహించేవారు. నంది ప్రాముఖ్యత ఎక్కువగా వుండటం వల్లనే ఈ ప్రాంతానికి 'నందివడ్డమాను' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఓ భక్తుడి కలలోకి శనిదేవుడు వచ్చి తన విగ్రహాన్ని ఈ క్షేత్రంలో ప్రతిష్ఠించమని కోరాడట. ఫలితంగా ఇప్పుడున్న శనిదేవుడి విగ్రహం ఆవిష్కృతమైంది.
సాధారణంగా శని పడితే ఏడున్నర సంవత్సరాలపాటు వదలదని చెబుతుంటారు. ఈ సంఖ్యకు ఇక్కడి గ్రామస్తులు ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ కారణంగానే ఏడున్నర అడుగుల ఈ విగ్రహాన్ని ఏడున్నర రోజుల్లో తయారు చేయించారు. భక్తులు విగ్రహానికి ఏడు ప్రదక్షిణలు చేస్తారు. ఈ క్షేత్రంలో శనీశ్వరుడు జ్యేష్టాదేవి సమేతుడై ఆరుబయట కొలువుదీరి కనిపిస్తూ వుండటం విశేషం. స్త్రీ పురుషులు స్వామివారికి స్వయంగా నువ్వుల నూనెతో అభిషేకం చేసుకునే అవకాశముంది. 'శనిత్రయోదశి' రోజున భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.
స్వామివారికి కొబ్బరి - బెల్లం నైవేద్యంగా సమర్పించిన భక్తులు, శివుడిని దర్శించుకుంటూ వుంటారు. ప్రాచీనకాలం నుంచి ఎందరికో వరాలను ప్రసాదిస్తూ వస్తోన్న శివుడు, తనని దర్శించిన భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు.