తల్పగిరి రంగనాథ స్వామి
శ్రీమన్నారాయణుడు వైకుంఠపురంలో ఆదిశేషుడిపై కొలువుదీరి ఉంటాడు. అలా ఆయన శయన నారాయణమూర్తిగా భూలోకంలో అనేక ప్రాంతాల్లో అవతరించి పూజలు అందుకుంటున్నాడు. ఈ విధమైనటువంటి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా అలరారుతోంది 'శ్రీ తల్పగిరి రంగనాథస్వామి' క్షేత్రం. ఇది నెల్లూరి జిల్లా 'రంగనాయకులపేట' లో దర్శనమిస్తుంది.
'కశ్యప మహర్షి' కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతంలో ఆవిర్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. ఆది శేషుడు ఇక్కడ కొండగా మారగా, దానిపై శ్రీ మహావిష్ణువు లక్ష్మీసమేతంగా ఆవతరించాడు. స్వామివారు శయనించడానికి గిరి (కొండ)ని తల్పంగా చేసుకోవడం వలన ఈ క్షేత్రానికి 'తల్పగిరి' అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామివారు రంగనాథస్వామిగా ... అమ్మవారు రంగనాయకిగా పిలవబడుతున్నారు.
క్రీ.శ. 7-8 శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడి మూలమూర్తికి పల్లవరాజులు ఆలయాన్ని నిర్మించినట్టు ఆధారాలు వున్నాయి. ఆ తరువాత వచ్చిన రాజులు ఆలయ అభివృద్ధికి తమవంతు కృషి చేశారు. గంభీరంగా కనిపించే రాజగోపురం ... దృఢమైన ప్రాకారాలు ... అంతరాలయాల నిర్మాణం ఆనాటి వైభవాన్ని కళ్ల ముందుంచుతుంది. గర్భాలయంలో స్వామి కొండంత దేవుడిగా కొలువై ఉంటాడు. ఆ పక్కనే గల మందిరంలో రంగనాయకి అమ్మవారు పూజలు అందుకుంటూ వుంటుంది.
సాధారణంగా ఆళ్వారులవి శిలా ప్రతిమలు మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ ఆళ్వారుల పంచలోహ ప్రతిమలు కొలువుదీరి వుండటం విశేషం. ఈ క్షేత్రంలో స్వామివారికి పవళింపు సేవ జరిపే 'అద్దాల మంటపం' ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. స్వామివారి వైభవానికి ఈ అద్దాల మంటపం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని చెప్పొచ్చు.
పర్వదినాల్లో స్వామికి విశేష పూజలు జరుగుతుంటాయి. ప్రతియేటా స్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో వేలసంఖ్యలోగల భక్తుల సమక్షంలో జరిగే 'రథోత్సవం' చూసి తీరవలసిందే.