కోన మల్లేశ్వర క్షేత్రం
భక్తులకు అందుబాటులో వుండటం కోసమే శివుడు లింగ రూపాన్ని ధరించి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు. శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన ... పూజించడం వలన కోటి జన్మల పాపాలు కొట్టుకుని పోతాయి. పుణ్యాలు ప్రవాహమై వచ్చి పుష్కరిణిగా మారి పునీతం చేస్తాయి.
ఈ కారణంగానే మునులు ... మహర్షులు ... దేవతలు వివిధ ప్రాంతాల్లో శివలింగాలను ప్రతిష్ఠించి పూజించారు. ఆ శివలింగాలే నేడు అనేక క్షేత్రాలలో దర్శనమిస్తూ ధన్యులను చేస్తున్నాయి. అలా అయిదు శివలింగాలతో అలరారుతోన్న క్షేత్రమే 'పంచలింగాల కోన'.
ఇది కడప - అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో గల 'పార్నపల్లి' లో కొలువైవుంది. మహా శివుడి పంచ ముఖాలుగా ఈ శివలింగాలను చెబుతుంటారు. అత్యంత మహిమాన్వితమైన ఈ శివలింగాలకు 'జనమేజేయుడు' ఆలయాన్ని నిర్మించినట్టుగా స్థలపురాణం చెబుతోంది. కొండపై ఈ క్షేత్రం వుండటం వలన ఇక్కడి శివయ్యను 'కోన మల్లేశ్వరుడు' గా పిలుస్తుంటారు.
మల్లేశ్వర స్వామి మనసున్న స్వామి అనీ ... అన్నివేళలా తన భక్తులను ఆయన కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడని స్థానికులు చెబుతుంటారు. పురాణకాలం నుంచి పూజలు అందుకుంటోన్న ఈ శివలింగాలకు కార్తీక మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈ క్షేత్రంలో గల కోనేటిలో స్నానమాచరించి భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. ఇక్కడి పంచాలింగాలను దర్శించుకోవడం వలన 'పంచారామాలను' దర్శించిన ఫలితం లభిస్తుందని చెబుతుంటారు.