దిల్ సుఖ్ నగర్ శిరిడీ సాయి
గురువారం అనగానే అందరికీ గుర్తొచ్చే గురుదైవం శిరిడీసాయి. శిరిడీలో నడయాడిన సాయి, భక్తుల బాధలను ... వ్యాధులను తనవిగా భావించి వాటిని స్వీకరిస్తుంటాడు. తన భక్తులు ఆకలితో వున్నా ... ఆపదలో వున్నా క్షణాల్లో అక్కడికి చేరుకొని వారిని అక్కున చేర్చుకుంటాడు. కులమతాలకు ... ప్రాంతాలకు అతీతంగా వ్యవహరిస్తూ తాను అందరివాడినని చెప్పాడు. భక్తులు విశ్వసించేలా ఆ మాటలను ఆయన ఆచరించి చూపాడు.
బాబా పిలిస్తే పలుకుతాడు అని అంతా అనుభవపూర్వకంగా తెలుసుకోబట్టే, ఈ రోజున ఆయన మందిరాలు ప్రతి ఊరులోను వెలుస్తున్నాయి. అలా హైదరాబాద్ - దిల్ సుఖ్ నగర్ లోను శిరిడీసాయి కొలువుదీరి కనిపిస్తాడు. హైదరాబాద్ లో బాబా ఆలయాలు చాలానే ఉన్నప్పటికీ, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా ఆలయానికి ఎంతో విశిష్టత వుంది. ఒకప్పుడు చిన్న మందిరం కనిపించిన ఈ ప్రదేశంలో నేడు సాయి సంస్థానం దర్శనమిస్తోంది.
అత్యంత వ్యయ ప్రయాసలకోర్చి భారీ ఖర్చుతో నిర్మించిన ఆలయం ... కరుణాకటాక్షాలను కురిపించే సాయి ప్రతిమ విశిష్టతను చాటుకుంటూ వుంటాయి. అనునిత్యం సాయికి జరిగే పూజాభిషేకాల్లోను ... హారతుల్లోను భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. ఇక గురువారం వచ్చిందంటే ఇక్కడ పండుగ వాతావరణమే కనిపిస్తుంది. ఈ రోజున జరిగే సాయి పల్లకీ సేవలో, ఆయన పల్లకిని మోయడానికి భక్తులు పోటీ పడుతుంటారు.
శిరిడీలో మాదిరిగానే ఇక్కడ అన్ని రకాల సేవలు ... ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. పండుగలు ... పర్వదినాల సమయంలో ఆలయం కళకళలాడుతూ వుంటుంది. సాయి చిరునవ్వులు చిందిస్తూ అందరిని చూపులతోనే పలకరిస్తున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడి బాబాను సేవిస్తూ వస్తున్న వారు జీవితంలో ఉన్నతమైన స్థానాలను అందుకుంటూ వస్తున్నారు. సాయి తమ వాడనే సంతోషం ... సంతృప్తి ప్రతి ఒక్కరిలోనూ కనిపిస్తుంది. ఈ కారణంగానే ఇక్కడికి వచ్చి సాయి అనుగ్రహాన్ని పొందే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.