శ్రీ రాధా పార్థసారథి మందిరం
ధర్మ మార్గాన్ని అనుసరించమనీ ... ఆచరించమని మానవాళికి ప్రభోదించిన అవతార పురుషుడు శ్రీకృష్ణుడు. ఆయన తత్త్వం సమస్త మానవాళికి చేరాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆవిర్భవించింది. ఈ సంఘం ప్రపంచ వ్యాప్తంగా వందల సంఖ్యలో కృష్ణ మందిరాలను నిర్మిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో రూపొందినదే 'శ్రీ రాధా పార్థసారధి మందిరం'.
సువిశాలమైన మైదానంలో నిర్మించబడిన ఈ మందిరం , అనంతపురంలో దర్శనమిస్తుంది. రాధా సమేత కృష్ణుడు కొలువుదీరిన కారణంగా ... రథాన్ని గుర్రాలు లాగుతున్నట్టుగా మందిర నిర్మాణం వుండటం వలన దీనిని రాధా పార్థ సారథి మందిరంగా పిలుస్తుంటారు. వెలుపలి నుంచి చూస్తే మందిర నిర్మాణంలో కనిపించే నైపుణ్యం ఆశ్చర్య చకితులను చేస్తుంది. లోపలికి అడుగు పెట్టగానే శ్రీకృష్ణుడి రాజ్యంలోకి వచ్చిన అనుభూతి కలుగుతుంది.
వేదికపై సర్వాంగ సుందరంగా కొలువుదీరిన రాధా కృష్ణులు, చూడముచ్చటగా కనిపిస్తుంటారు. ఓ వైపున శ్రీకృష్ణుడి బాల్య క్రీడలకు సంబంధించిన శిల్పాలు ... మరో వైపున శ్రీ కృష్ణుడి జీవితంలోని మధురమైన ఘట్టాలను ఆవిష్కరించే తైల వర్ణ చిత్రాలు దర్శనమిస్తాయి. భగవద్గీత సారాంశం ... వాటికి సంబంధించిన చిత్రాలు కొలువుదీరి కనిపిస్తాయి. కృష్ణ భక్తి కుసుమాలను విశ్వ వ్యాప్తంగా వెదజల్లిన 'శ్రీల ప్రభుపాదుల వారి విగ్రహం కూడా మందిరంలో దర్శనమిస్తుంది. శ్రీకృష్ణుడి తత్త్వాన్ని అన్ని వైపులా నుంచి ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నం అభినందించదగినదిగా అనిపిస్తుంది.
పవిత్రతకు ... ప్రశాంతతకు ప్రతీకగా కనిపించే ఈ మందిరంలో '' ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామం నిరంతరం ప్రతిధ్వనిస్తూనే వుంటుంది. విశేషమైన పర్వదినాల్లో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. మానసిక ప్రశాంతతను అందించే ఈ మందిరంలో కాసేపు కూర్చుని శ్రీ కృష్ణుడి లీలా విశేషాలను తలచుకుంటే తన్మయత్వం కలుగుతుంది ... మాధవుడి సేవకు మనసు ఉవ్విళ్ళూరుతుంది.