పెరుమాళ్ల సంకీస
భారతీయుల ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ప్రభావితం చేసిన సీతారాములు, ప్రతి ఊరులోను ... ప్రతి ఒక్కరి హృదయంలోను చెరగని స్థానాన్ని సంపాదించుకున్నారు. అలా వారు కొలువుదీరిన విశిష్టమైన క్షేత్రాల్లో 'పెరుమాళ్ల సంకీస' ఒకటి. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ ఆలయం దర్శనమిస్తుంది.
సాధారణంగా గర్భాలయాలలో సీతారాములు ... లక్ష్మణ హనుమంతులు మాత్రమే దర్శన మిస్తుంటారు. కానీ ఇక్కడి గర్భాలయంలో సీతారాములు ... లక్ష్మణ భరత శత్రుఘ్నులు కొలువుదీరి వుండటం విశేషం. గర్భాలయం ఎదురుగా హనుమంతుడు దర్శనమిస్తుంటాడు. పూర్వం ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని గ్రామ పెద్దలు అందుకు తగిన ఏర్పాట్లను చేశారు. అయితే మూలవిరాట్టుని మలచడానికి శిల్పులు ప్రయత్నించిన ప్రతిసారి శ్రీ రాముడి రూపమే ఆవిష్కృతమైందట. దాంతో అది స్వామివారి మహిమగా భావించి ఆయన విగ్రహాన్నే ప్రతిష్ఠించారు.
శతాబ్దాల చరిత్ర గల ఇక్కడి ఆలయ వైభవానికి రాజగోపురం అద్దం పడుతూ వుంటుంది. విశాలమైన ప్రాంగణం ... ఓ వైపున నైవేద్యాలను తయారుచేసే 'తిరువంటపడి' ... మరో వైపున కల్యాణోత్సవం జరిపే మంటపం కనిపిస్తాయి. అక్కడి నుంచి లోపలికి వెళితే వేణుగోపాలస్వామి మందిరం ... ఆండాళ్ మందిరం ... ఆళ్వారుల మందిరం దర్శనమిస్తాయి. ఆ పక్కనే గల అద్దాల మంటపంలో, ఉత్సవాల సమయంలో స్వామివారికి పవళింపు సేవను నిర్వహిస్తుంటారు.
ఇక్కడి శ్రీ రాముడు సౌందర్య మూర్తి ... ఈ అందం అటు మూలమూర్తిలోను ... ఇటు ఉత్సవ మూర్తిలోను తొణికిసలాడుతుండటం విశేషం. ఈ కారణంగానే ''వైభవంలో భద్రాద్రి రాముడు ... చక్కదనంలో సంకీస రాముడు'' అని భక్తులు చెప్పుకుంటూ వుంటారు. భద్రాచలంలో మాదిరిగానే ఇక్కడ శ్రీ రామనవమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి.
ఈ గ్రామంలో పుట్టి పెరిగిన వారు ఎక్కడ వున్నా ఈ ఊరుకి చేరుకొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకిస్తుంటారు. అంతగా ఇక్కడి రాముడు స్థానికుల హృదయాలతో పెనవేసుకుపోయాడు. ఒకసారి చూసినంతనే మనసుపై మరువలేని ముద్ర వేసే సంకీస రాముడిని చూసి తీరవలసిందే ... ఆయన అనుగ్రహంతో జీవితాన్ని చరితార్థం చేసుకోవలసిందే.