పాలకొండ దుర్గమ్మ
కరుణించడంలోను ... కష్టాలను కరిగించడంలోను కనకదుర్గమ్మ ముందుంటుందని అంటుంటారు. తనని నమ్ముకున్న బిడ్డల ఆలనా పాలన చూసుకోవడానికి గాను ఆ తల్లి ఆవిర్భవించిన క్షేత్రమే 'పాలకొండ'. శ్రీకాకుళం జిల్లాకి చెందిన ఈ గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ అమ్మవారు స్వయంభువుగా వెలసింది.
అప్పట్లో ఈ ప్రాంతం సవర రాజుల ఏలుబడిలో వుండేది. వారి కోటలో వెలసిన కారణంగానే దుర్గమ్మకి 'కోట దుర్గమ్మ'గా పేరు వచ్చింది. అయితే అప్పట్లో రాజులు ... వారి కుటుంబ సభ్యులు మాత్రమే అమ్మవారిని దర్శించుకుని పూజించుకునే వారు. కాలక్రమంలో రాజరికాలు అంతరించడంతో, కోటలోని అమ్మవారికి ఆదరణ కరవైంది.
అలాంటి పరిస్థితుల్లో అమ్మవారు 'కృష్ణదాసు' అనే భక్తుడి కలలో కనిపించి తన జాడను తెలియజేసింది. తనకి ఆలయం నిర్మించి భక్తులకి తన దర్శనభాగ్యం కలిగించమని కోరింది. కృష్ణదాసు గ్రామ పెద్దలకు విషయం చెప్పి వారి సహకారంతో అమ్మవారు చెప్పినట్టుగానే చేశాడు. నాటి నుంచి తిరిగి అమ్మవారు నిత్య పూజలు అందుకుంటోంది.
ఇప్పటికీ ఆనాటి పద్ధతులను అనుసరించే అమ్మవారికి ఉత్సవాలు ... ఊరేగింపులు జరుగుతుంటాయి. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కోట దుర్గమ్మను దర్శించి తమ మొక్కుబళ్లు చెల్లిస్తుంటారు. అడిగినదే తడవుగా అమ్మవారు ఆయురారోగ్యాలను ... సిరిసంపదలను ప్రసాదిస్తుందని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.