ప్రమాణ ఫలితం
పురాణాలను ... ఇతిహాసాలను పరిశీలిస్తే, వాటిలో ప్రమాణాలకు సంబంధించిన ప్రధానమైన ఘట్టాలు కనిపిస్తాయి. ప్రమాణాల కారణంగానే జీవితాలు అనూహ్యమైన మలుపులు తిరిగిన విధానాలు స్పష్టంగా తెలుస్తాయి. పూర్వం చాలా గొడవలు ప్రమాణంతోనే పరిష్కారమయ్యేవి. ప్రాచీన కాలం నుంచి నేటి వరకూ ప్రమాణాలకు ఎంతో ప్రాధాన్యత వుంది.
సాధారణంగా ఎవరైనా తమ నిజాయితీని నిరూపించుకోవడానికి ... తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడానికి ప్రమాణాలు చేయడం జరుగుతుంటుంది. ఈ ప్రమాణం కారణంగానే అవతలి వ్యక్తి చెప్పే విషయాన్ని విశ్వసించడం జరుగుతుంటుంది. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడానికి ... ఇక ముందు చేయననే నమ్మకాన్ని కలిగించడానికి తాము అధికంగా ప్రేమించే వారిపై గాని, దేవుడిపై గాని ప్రమాణం చేస్తుంటారు.
ప్రమాణమనేది అది చేసే వారి సంస్కారం పై ఆధారపడి వుంటుంది. నీతి నియమాలతో జీవించేవారు ... కుటుంబ జీవనానికి విలువని ఇచ్చేవారు ... దైవం పట్ల విశ్వాసం వున్న వారు అబద్ధపు ప్రమాణాలు చేయడానికి సాహసించరు. ఒకవేళ అందుకు తెగిస్తే ... కుటుంబ సభ్యుల విశ్వాసాన్ని కోల్పోవడమే కాకుండా, సమాజం దృష్టిలో కూడా లోకువ అవుతారు. ఇక భగవంతుడి పై ప్రమాణం చేసి అబద్ధం చెబితే ఆయన అస్సలు సహించడు. తనపై నమ్మకం లేకుండా అబద్ధం చెప్పి, తనని అడ్డుపెట్టుకుని ఇతరులను నమ్మించడానికి ప్రయత్నం చేసిన వారిని ఆయన తనదైన పద్ధతిలోనే శిక్షిస్తుంటాడు.
అందుకే ఎంతో విలువ ... విశిష్టత గల ప్రమాణాల విషయంలో ఎవరూ తేలికగా వ్యవహరించకూడదనీ, లేదంటే తగిన ఫలితాన్ని అనుభవించవలసి వస్తుందని పెద్దలు చెబుతూ వచ్చారు.