శ్రీ వాసుదేవ పెరుమాళ్
శ్రీమన్నారాయణుడే 'వాసుదేవ పెరుమాళ్' గా పిలవబడుతోన్న క్షేత్రం మనకి శ్రీకాకుళం జిల్లా 'మందస'లో కనిపిస్తుంది. ఈ క్షేత్రం ఇక్కడ ఆవిర్భవించడానికి దారితీసిన పరిస్థితులు ఆసక్తికరంగా అనిపిస్తాయి. పూర్వం ఇక్కడి సంస్థానాధీశులు బ్రహ్మ హత్యా పాతకం నుంచి బయటపడటం కోసం, ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్ విగ్రహాన్ని తయారుచేయించి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి స్వామికి నిత్యపూజలు జరుగుతున్నాయి.
ప్రాచీన వైభవంతో విరాజిల్లుతోన్న ఈ క్షేత్రంలో స్వామివారు నయన మనోహరంగా దర్శనమిస్తుంటాడు. చక్కని కనుముక్కుతీరుతో ... చిరునవ్వులు చిందిస్తూ సుకుమారంగా కనిపించే స్వామి భక్తుల హృదయాలను భారీగానే కొల్లగొడుతుంటాడు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీదేవి - గోదాదేవి మందిరాలు కూడా దర్శనమిస్తుంటాయి. పూరీ జగన్నాథస్వామి ఆలయ నిర్మాణ శైలిని పోలిన నిర్మాణం మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ వుంటుంది. ఇక ఆలయం పై కప్పు పై ... గోడల పై ... స్తంభాల పై దర్శనమిచ్చే వివిధ శిల్పాలు మంత్రముగ్ధులను చేస్తుంటాయి.
హనుమంతుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో, ప్రతియేటా మార్చి మొదటి వారంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించి తరించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటూ వుంటారు. వాసుదేవ పెరుమాళ్ ను దర్శించడం వలన జ్ఞానం ... ఆరోగ్యం ... సంపద లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.