సరస్వతీ క్షేత్రం
సాధారణంగా సరస్వతీదేవి ఆలయం అనగానే అమ్మవారు నెమలి వాహనంపై గానీ ... హంస వాహనంపై గాని... కమలంపై గాని కూర్చుని దర్శనమిస్తుంటుంది. అందుకు భిన్నంగా అమ్మవారు వీణ పట్టుకుని నిలుచుని దర్శనమిచ్చే క్షేత్రాలు అరుదుగా కనిపిస్తుంటాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటి అనంతసాగర్. ఇది మెదక్ జిల్లా చిన్నకొండూరు మండలంలో దర్శనమిస్తుంది.
అందమైన ప్రకృతి ఒడిలో ... ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన అమ్మవారిని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవనిపిస్తుంది. అమ్మవారు మూలమూర్తి నిలుచున్నట్టుగా వుంటే, అది మరింత విశిష్టమైన క్షేత్రంగా చెబుతుంటారు. ఈ ప్రత్యేకత కారణంగానే భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలి వస్తుంటారు. తమ సంతానానికి అమ్మవారు బుద్ధిని ... జ్ఞానాన్ని ప్రసాదించాలనే ఉద్దేశంతో, అన్నప్రాసన ... అక్షరాభ్యాస కార్యక్రమాలను భక్తులు ఇక్కడ నిర్వహిస్తుంటారు.
ఇక అమ్మవారు ఆవిర్భవించిన 'మాఘశుద్ధ పంచమి' రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. అమ్మవారికి తెలుపు రంగు అంటే ఇష్టం కనుక ఆ రంగు వస్త్రాలతో ... పూలమాలలతో అందంగా అలంకరిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడం కోసం వివిధ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
ఆలయానికి దగ్గరలోని ఒక గుహలో మూడు చిన్న చిన్న బావులు వుంటాయి. వీటిని ఇనుపదోనే ... పాలదోనే ... చీకటి దోనే అనే పేర్లతో ఇక్కడ పిలుస్తుంటారు. మొదటి రెండు బావులలోని నీళ్లు ఎంతో మహిమాన్వితమైనవని చెబుతుంటారు. ఈ బావులలోని నీరు తీర్థంగా స్వీకరించడం వలన మానసిక పరమైన ... శారీరక పరమైన వ్యాధులు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.