పండుగ రోజున దానం
జీవితానికో అర్థం - పరమార్థం లభించాలంటే ఉన్నదాంట్లో కొంత భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించమనే పెద్దలు చెప్పారు. అర్హత కలిగిన వారికి దానం చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అంటారు. ఆపదలో వున్నవారికి ఆర్ధిక సాయం చేయడం వలన ... దేవాలయాల దగ్గర చేసే దానధర్మాల వలన అవసరమైన పుణ్యం అందుతూనే వుంటుంది. అయితే మామూలు రోజుల్లోకన్నా విశేషమైనటువంటి పండుగ రోజుల్లోనూ ... పర్వదినాల్లోను చేసే దానాల వలన మరింత ఉత్తమమైన పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
తెలుగువారు జరుపుకునే పండుగలలో 'సంక్రాంతి' కి పెద్ద పండుగ అనే పేరుంది. ఈ పండుగ రోజున ఎలాంటి దానం చేసినా దాని వలన లభించే పుణ్యం అంతా ఇంతా కాదు. ఈ రోజున బంగారంతో గానీ ... వెండితో గానీ ... కంచుతోగాని త్రిమూర్తుల రూపాలను చేయించి దానం చేసినట్టయితే, ఈ భూమండలాన్ని దానం చేసిన ఫలితం లభిస్తుంది.
అంత తాహతు లేనివారు నిరుత్సాహ పడవలసిన పనిలేదు. సంక్రాంతి రోజున పాయసం ... పెరుగు ... మజ్జిగ ... వంటివి దానం చేసినా పుణ్య ఫలాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.