త్రివేణీ సంగమం
త్రివేణీ సంగమ స్థానంలో స్నానమాచరించి ... తీరంలోని ఆలయాలను దర్శించడం వలన సమస్త పాపాలు నశించి పోతాయని అంటూ వుంటారు. ఇక మాఘమాసంలో నదీ స్నానాలు మహోన్నతమైన ఫలితాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి, ఇలాంటి సంగమ స్థానాలకు భక్తులు వేలసంఖ్యలో వస్తుంటారు. ఆధ్యాత్మిక ద్వారాలు తెరుస్తూ అలాంటి భక్తులకు ఆహ్వానం పలుకుతోంది నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి.
ఇక ఈ ఊరికి ఈ పేరు రావడానికి ఆధ్యాత్మిక పరమైన కారణమే వుంది. స్కందుడు (కుమార స్వామి) వెలసిన 'కుర్తి' (నదుల కూడలి) కనుక దీనికి 'స్కందకుర్తి' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అది కాస్తా 'కందకుర్తి' గా మార్పు చెందింది. కుమారస్వామి ఆవిర్భవించిన ఈ క్షేత్రంలో గోదావరి ... మంజీరా ... హరిద్ర నదులు కలుస్తాయి. త్రేతాయుగంలో అరణ్యవాస సమయంలో సీతారాములు ఈ ప్రదేశానికి వచ్చినట్టుగా చెబుతారు. అందుకు సంబంధించిన ఆనవాళ్లను ఇక్కడి రామాలయం దగ్గర చూపుతుంటారు.
ఇక సంగమేశ్వరం ఆలయంలోని శివలింగం ఇక్కడి సంగమ స్థానంలో బయటపడినదేనని అంటూ వుంటారు. ఈ కారణంగా ఇది శివకేశవ క్షేత్రంగా అలరారుతోంది. పుష్కర సమయంలోను ... కార్తీక ... మాఘమాసాల్లోను, లక్షలాదిగా భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడి సంగమ స్థానంలో స్నానమాచరించి దైవ దర్శనం చేసుకుని వెళుతుంటారు.