బుధగ్రహ ప్రభావం

బుధగ్రహ ప్రభావం
బుధుడుకి చాలా మంచివాడనే పేరు వుంది. 'మిథునం' ... 'కన్య' రాశులకు ఆయన అధిపతిగా వ్యవహరిస్తుంటాడు. కత్తి .. డాలు ... గద ... ధరించి వర ముద్రతో కనిపించే బుధుడు, సింహ వాహనంపై సంచరిస్తూ ఉంటాడు. పసుపు రంగు వస్త్రాలను ... పువ్వులను ధరించి ప్రశాంత వదనంతో కనిపిస్తాడు. తారా చంద్రులకు జన్మించిన బుధుడు, బ్రహ్మ దేవుడి అనుగ్రహంతో గ్రహంగా మారాడు.

బుధుడికి అధిదేవత శ్రీ మహా విష్ణువు. బుధుడు మహాజ్ఞాని కావడంతో, మను మహారాజు తన కూతురు 'ఇళ'ను ఆయన కిచ్చివివాహం జరిపించాడు. వీరికి జన్మించినవాడే పురూరవుడు ... అలా చంద్ర వంశం వృద్ధి చెందుతూ వచ్చింది. బుధుడు వలన కలిగే మహర్దశ పదిహేడు సంవత్సరముల పాటు కొనసాగుతుంది. ఆయన అనుగ్రహం వలన మంచి ఫలితాలు లభిస్తాయి.

బుధ గ్రహం కారణంగా చిన్న చిన్న ఇబ్బందులే ఎదురౌతున్నప్పటికీ శాంతి చేయించవలసి వుంటుంది. దోషం తొలగి పోయేంత వరకూ ప్రతి అమావాస్య రోజున ఇందుకు సంబంధించిన వ్రతం చేయవలసి వుంటుంది. బుధుడిని శాంతింప చేయడానికి 'మరకతం' ధరించాలి. పగడం ... బంగారం ... నెయ్యి దానం చేయడం వలన, వ్యతిరేక ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.

More Bhakti Articles