తిరు నక్షత్రోత్సవాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సేవలు నిత్య కల్యాణం ... నిరంతర వైభవం అన్నట్టుగా జరుగుతుంటాయి. నిత్యోత్సవాలు ... పక్షోత్సవాలు ... మాసోత్సవాలు ... బ్రహ్మోత్సవాలు ... ఇలా విశేషమైన రీతిలో ఉత్సవాలు - ఊరేగింపులు జరుగుతూ వుంటాయి. వీటిలో భాగంగా జరిగే తిరు నక్షత్రోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత వుంటుంది.
ప్రతి నెలా 'రోహిణి నక్షత్రం' ... 'ఆరుద్ర నక్షత్రం' ... 'పునర్వసు నక్షత్రం' ... 'శ్రవణ నక్షత్రం' రోజుల్లో జరిగే ఉత్సవాలను 'తిరు నక్షత్రోత్సవాలు' అని అంటూ వుంటారు. ఇక ఈ నక్షత్రాలు నెలకోసారి వస్తుంటాయి గనుక వీటిని 'మాసోత్సవాలు' అనికూడా అంటూ వుంటారు. ఇక ఈ తిరు నక్షత్రోత్సవాల సమయంలో ఆయా ఉత్సవ మూర్తులకు అభిషేకాలు ... అలంకరణలు ప్రత్యేకంగా జరుగుతాయి.
రేపల్లెలో గోపాలుడిగా అందరి మనసులను అల్లరితో కట్టిపడేసిన శ్రీ కృష్ణుడే ... తిరుమలలో వేంకటేశ్వరుడుగా అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కారణంగా శ్రీ కృష్ణుడి జన్మ నక్షత్రమైన 'రోహిణి నక్షత్రం' రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక శ్రీవారి కైంకర్యాలలో శ్రీ రామానుజాచార్యుల వారు ప్రధానమైన పాత్రను పోషించిన కారణంగా, ఆయన జన్మ నక్షత్రమైన 'ఆరుద్ర నక్షత్రం' రోజున స్వామివారితో పాటు పురవీధుల్లో ఊరేగిస్తారు.
శ్రీ రాముడే ... శ్రీనివాసుడుగా అవతరించాడని చెప్పబడుతోంది కాబట్టి, రాముడి జన్మ నక్షత్రమైన 'పునర్వసు నక్షత్రం' రోజున, ఇక్కడి సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఇక 'శ్రవణ నక్షత్రం' రోజున స్వామివారు స్వయంభువుగా అవతరించాడు గనుక, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. కనువిందుగా జరిగే ఈ ఉత్సవాలను వీక్షించడం వలన మనసు పరవశిస్తుంది ... మోక్షానికి అవసరమైన అర్హతను పొందినట్టుగా అనిపిస్తుంది.