లక్ష్మీ నారసింహుడు
లక్ష్మీ నరసింహస్వామి అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించి అక్కడి భక్తులను అనుగ్రహిస్తూ వున్నాడు. అలా స్వామివారు లక్ష్మీ సమేతుడై వెలసిన క్షేత్రం మనకి వరంగల్ జిల్లా మల్లూరు సమీపంలోనూ దర్శనమిస్తుంది. పూర్వం భరద్వాజ మహర్షి తన శిష్యులతో కలిసి ఈ ప్రాంతం గుండా వెళుతుండగా, తాను ఇక్కడి 'హేమా చలం'పై ఉన్నట్టుగా స్వామివారు చెప్పారట. దాంతో ఆ మహర్షి ఇక్కడి గుహలోని గోడపై వెలసిన స్వామివారిని దర్శించి పూజించాడు. అప్పటి నుంచి స్వామికి నిత్యార్చనలు జరుగుతున్నాయి.
ఈ క్షేత్ర వైభవం వెలుగు చూస్తున్నా కొద్ది ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారి ఎడమ పాదం కిందనుంచి నీరు అదే పనిగా ధారగా వస్తూ వుంటుంది. ఆ జలధార ఎక్కడి నుంచి అక్కడికి వస్తుందనేది ఎవరికీ తెలియదు. రుద్రమదేవి అనారోగ్యంతో బాధపడుతోన్న సమయంలో, ఈ స్వామివారిని దర్శించి ఈ జలధారను తీర్థంగా సేవించిందట. అంతే అప్పటి వరకూ ఆమెను పట్టి పీడిస్తోన్న అనారోగ్యం మటుమాయమైపోయింది. అది మహిమాన్వితమైన తీర్థంగా భావించిన రుద్రమదేవి ఆ జలం వృధా కాకుండా కోనేటిని తవ్వించింది. అంతే కాకుండా ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేసింది.
ఇక్కడ క్షేత్ర పాలకుడిగా హనుమంతుడు కనిపిస్తుంటాడు. గర్భాలయంలోని స్వామివారికి తైలాభిషేకం చేయడం ఆనవాయతీగా వస్తోంది. ఇక వైశాఖ మాసంలో ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవ వేడుకల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటారు. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ కొండంత దేవుడుని దర్శించడం వలన, మానసిక పరమైన ... శారీరక పరమైన వ్యాధులు నశిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.