చెంగాళమ్మ పరమేశ్వరి
సాధారణంగా క్షేత్రమేదైనా ... ఆలయమేదైనా గర్భగుడికి తప్పనిసరిగా తలుపులు వుంటాయి. అయితే తన భక్తులు తనని ఏ సమయంలోనైనా దర్శించుకోవడం కోసం తన గర్భగుడికి తలుపులు ఉండకూడదని స్వయంగా చెప్పిన అమ్మవారే 'చెంగాళమ్మ'. ఇప్పటికీ గర్భాలయానికి తలుపులు లేకుండా దర్శనమిచ్చే ఆ క్షేత్రం మనకి 'సూళ్లూరుపేట'లో కనిపిస్తుంది. ఈ క్షేత్రంలో వెలసిన అమ్మవారికి 'సుళ్ల' (సుడుల) ఉత్సవం నిర్వహిస్తుంటారు. ఈ కారణంగానే ఈ ప్రదేశానికి 'సూళ్లూరుపేట' అనే పేరు వచ్చింది.
ఇక స్థల పురాణానికి సంబంధించిన విషయానికి వస్తే, పూర్వం 'శుభగిరి' అనే పేరుతో వెలుగొందిన ఈ ప్రాంతంలో 'కాళంగి' నది ప్రవహిస్తూ వుండేది. కొంతమంది పశువుల కాపరులకి అమ్మవారి విగ్రహం ఈ నదిలో దొరికింది. మహిషాసుర మర్దినిగా దర్శనమిస్తున్న అమ్మవారిని ఊళ్లోకి తరలించడానికి పెద్దలంతా ప్రయత్నించారు. కానీ ఆ విగ్రహం అక్కడి నుంచి అంగుళం కూడా కదలకపోవడంతో, అమ్మవారికి అక్కడ ఉండటమే ఇష్టమని భావించి ప్రతిష్ఠించారు. ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో, గర్భగుడికి తలుపులు పెట్టించడానికి ప్రయత్నించగా గ్రామ పెద్దకి అమ్మవారు కలలో కనిపించి వారించిందట. అప్పటి నుంచి అదే పద్ధతిన భక్తులు చెంగాళ పరమేశ్వరిని ఆరాధిస్తూ వస్తున్నారు.
సంతానాన్ని అనుగ్రహించే తల్లిగా ఈ అమ్మవారు ప్రసిద్ధి చెందింది. ఇక 'షార్'లో రాకెట్ ప్రయోగానికి ముందుగా దాని నమూనాను అమ్మవారి పాదాల చెంత వుంచి పూజించడం ఆనవాయతీగా వస్తోంది. దీనిని బట్టి అమ్మవారి పట్ల అక్కడి వారికి గల భక్తి విశ్వాసాలు ఎంతటి బలమైనవో తెలుస్తోంది. అమ్మవారికి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా జరిగే సుళ్ల ఉత్సవం ... గ్రామోత్సవం ... తెప్పోత్సవం ... పల్లకీ సేవ చూసి తీరవలసిందే.