నత్తా రామేశ్వరం
శ్రీమన్నారాయణుడు ధరించిన దశావతారాలలో 'రామావతారం ' ... 'పరశురామావతారం' ఎంతో విశిష్టమైనవి. ఈ రెండు అవతారాలలో శ్రీమన్నారాయణుడు ఒకే ప్రదేశంలో రెండు శివలింగాలను ప్రతిష్ఠించడం విశేషం. అ విశేషాన్ని సొంతం చేసుకున్న ఆ క్షేత్రమే 'నత్తా రామేశ్వరం'. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుమంట్ర మండలంలో విలసిల్లుతోంది.
'నత్తా రామేశ్వరం' పేరు వినగానే అసలా ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలని అనిపిస్తుంది. సీతా సమేతంగా ఇక్కడికి వచ్చిన శ్రీ రామచంద్రుడు, 'నత్త గుల్లలు' కలిసిన ఇసుకతో శివలింగ ప్రతిష్ఠ చేయడం వలన ఈ క్షేత్రానికి ... ఈ ఊరుకి 'నత్తా రామేశ్వరం' అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతోంది. దక్షిణ ముఖంగా దర్శనమిచ్చే ఇక్కడి రామలింగేశ్వరుడిని పెద్ద సంఖ్యలో భక్తులు పూజిస్తూ వుంటారు.
ఇక ఇదే ప్రదేశంలో పశ్చిమాభి ముఖంగా మరో శివలింగం కొలువుదీరి కనిపిస్తుంది. దీనిని పరశురాముడు ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి. అత్యంత పవిత్రమైన ఈ ప్రదేశంలో పరశురాముడు యజ్ఞయాగాదులు నిర్వహించాడు. మునులు ... ఋషులు ... దేవతలు ... ఇలా మొత్తం ఏడు కోట్ల మంది సమక్షంలో ఇక్కడి శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే ఈ శివలింగాన్ని 'సప్త కోటీశ్వర లింగం' అని పిలుస్తుంటారు.
ఇక ఈ ఆలయం ఏడాది పొడవునా నీళ్లలో మునిగే వుంటుంది. అందువలన ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీరు తోడి ఆ మాసమంతా పూజాభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ క్షేత్రం వైభవోపేతంగా వెలుగొందడానికి తూర్పు చాళుక్యులు కృషి చేసినట్టు ఆధారాలు వున్నాయి. నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి యేటా ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.