తిరునాళై పోవార్ నాయనార్
తిరునాళై పోవార్ నాయనార్ క్రీ.శ. 660- 840 మధ్య కాలంలో జీవించిన మహా భక్తుడు. తమిళనాడులోని ఆదనూర్ అనే గ్రామంలో జన్మించిన నాయనార్, బాల్యం నుంచే శివారాధన చేయడం చూసి అందరూ ఆశ్చర్య పోయేవారు. వయసుతో పాటు శివుడి పట్ల ఆయన భక్తి కూడా పెరుగుతూ వచ్చింది. శివాలయాలను దర్శించడానికి ... శివుడి తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఎంతగానో ఆరాటపడేవాడు.
ఎక్కడెక్కడ శైవ పుణ్య క్షేత్రాలు ఉన్నాయో తెలుసుకుని అక్కడికి వెళ్లి స్వామి దర్శనం చేసుకోవాలని తహతహలాడేవాడు. ఒకసారి ఆయన తిరుప్పుణ్ గూర్ (పళయ వైదీశ్వరన్ కోయిల్) క్షేత్రానికి వెళ్లాడు. కుల తత్వం కారణంగా లోపలికి వెళ్లే సాహసం చేయలేక బయటనుంచే దర్శనం చేసుకోవాలని అనుకున్నాడు. అయితే అందుకు నందీశ్వరుడి విగ్రహం అడ్డురావడంతో ఆయన ఎంతో బాధపడ్డాడు. అంతలోనంది విగ్రహం దానంతట అదే కాస్త పక్కకి జరగడంతో ఆయనకి శివుడు దర్శనం లభించింది. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికీ అక్కడి దేవాలయంలో నంది విగ్రహం స్వామివారికి ఎదురుగా కాకుండా కాస్త పక్కకి కనిపిస్తూ వుంటుంది.
ఆ తరువాత నాయనార్ చిదంబరాన్ని దర్శించాలని అనుకున్నాడు. అయితే అక్కడికి వెళ్లే సాహసం చేయలేక ఏ రోజుకారోజు మరుసటి రోజు వెళతానంటూ వాయిదా వేయడం మొదలు పెట్టాడు. ఈ కారణంగానే అందరూ ఆయనను 'నాళై పోవార్' అని ఆటపట్టించడం మొదలు పెట్టారు. చివరికి అతను తన యజమాని అయిన భూస్వామికి విషయం చెప్పి ఆయన అనుమతి కోరాడు. కోత పనులు పూర్తి అయిన తరువాత వెళ్లమని భూస్వామి చెప్పాడు.
అయితే వంద మంది కూలీలు చేసే ఆ పనిని కొన్ని గంటల వ్యవధిలోనే నాయనార్ పూర్తి చేయడం చూసిన ఆ భూస్వామి, ఆయన మహాభక్తుడని తలచి పాదాలపై పడి నమస్కరించాడు. నాయనార్ చిదంబరం చేరుకోవడానికి ముందురోజే, అక్కడి బ్రాహ్మణ పండితులకు శివుడు కలలో కనిపించి ఆయనకి గౌరవ మర్యాదలతో కూడిన ఆలయ ప్రవేశం కల్పించమని చెప్పాడు. నాయనార్ ఏ స్థాయి భక్తుడనే విషయం తెలుసుకుని వారంతా ఆశ్చర్య పోయారు. కనులారా శివుడి దర్శనం చేసుకున్న నాయనార్, అందరూ చూస్తుండగానే శివ సాయుజ్యాన్ని పొందాడు.