శ్రీకృష్ణ జన్మభూమి
వైకుంఠ వాసుడు ... ద్వాపరయుగంలో శ్రీ కృష్ణుడిగా అవతరించి అల్లరివాడుగా ... అందరివాడుగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అలాంటి మాధవుడి జీవిత విశేషాలను చూపుల దోసిలిలోకి తీసుకోవాలంటే 'మధుర'ను మనసారా దర్శించవలసిందే. మధురలో అడుగుపెట్టగానే శ్రీకృష్ణుడి కాలంలో ఉన్నావేమోననే అనుభూతి కలుగుతుంది. అందుకు కారణం ఆనాటివిగా చెప్పబడుతోన్న ఆనవాళ్లు ఈనాటికీ ఇక్కడ కనిపిస్తూ ఉండటమే.
మధురలో శ్రీ కృష్ణుడు జన్మించిన ప్రదేశం ... కంసుడిని సంహరించి విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ... యశోదకు తన నోటిలో సమస్త విశ్వాన్ని చూపిన ప్రదేశం ... కాళీయ సర్పంపై తాండవమాడిన ప్రదేశం ... గోవర్ధనగిరిని ఎత్తిన ప్రదేశం ... గోపికలను ఆటపట్టించిన ప్రదేశం ... చూస్తుంటే ఈ మధ్యకాలంలోనే ఇవన్నీ జరిగినట్టుగా అనిపిస్తుంది. శ్రీకృష్ణుడు ఏదో పనిమీద పక్కవూరు వెళ్లి ఉంటాడనీ, కనీసం రాధైనా కనిపించకపోతుందా అని మన కళ్లు ఆమె కోసం వెదుకుతాయి.
ఇక యమునా నది తీరంలో 'బృందావనం' ... ఆ సమీపంలోనే 'రాధ' జన్మించిన 'బర్సానా' ప్రాంతం ... నందుడు నివశించిన గ్రామం కనిపిస్తాయి. బృందావనంలోని 'నిధి వనం' చూడవలసిన ప్రదేశం. ఇక్కడ రాధ స్నానం చేసిన కోనేరు ... శ్రీ కృష్ణుడి పాదముద్రలు కనిపిస్తాయి. ఇక ప్రాచీనకాలం నాటి కృష్ణాలయం ఇక్కడ తన విశిష్టతను ఆవిష్కరిస్తూ వుంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కృష్ణ మందిరాలు కనిపిస్తుంటాయి ... అన్ని వైపులా నుంచి ఆయన భజనలు వినిపిస్తుంటాయి.
అందమైన ... ఆహ్లాదకరమైన ఈ ప్రదేశాల్లో రాధాకృష్ణులు ఇప్పుడు లేరే అనుకుంటే మనసంతా గుబులుగా అనిపిస్తుంది. ఆ కాలంలో మనమూ పుట్టి వుంటే ఎంత బాగుండునోనని అనిపిస్తుంది.