క్షౌరము - వారాలు
సాధారణంగా జుట్టు పెరిగి కాస్త చిరాకును కలిగిస్తే చాలు వెంటనే 'క్షౌరం' చేయించుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో అష్టమి అయినా ... అమావాస్య అయినా పెద్దగా పట్టించుకోరు. తమకి ఎప్పుడు కాస్త తీరిక దొరికితే అప్పుడే క్షౌరం చేయించుకుంటూ వుంటారు.
ఆఫీసులకు ఆదివారం రోజున సెలవు కనుక చాలామంది ఆ రోజున క్షౌరం చేయించుకుంటూ వుంటారు. ఇక పిల్లలకి కూడా ఆదివారం రోజున స్కూళ్లకి సెలవుకావడం వలన, పనిలో పనిగా ఆ రోజే వాళ్లకి కూడా క్షౌరం చేయించేస్తుంటారు. దీనంతటికి కారణం క్షౌరం ఎప్పుడు చేయించుకోవాలనే విషయంపై శ్రద్ధ పెట్టకపోవడం ... ఈ విషయానికి అంతగా ప్రాధాన్యతను ఇవ్వకపోవడమనే చెప్పాలి.
నిజానికి క్షౌరం చేయించుకోవడానికి అనుకూలమైన రోజులు ... ప్రతికూలమైన రోజులు వున్నాయని శాస్త్రం చెబుతోంది. అష్టమి ... నవమి ... చతుర్దశి ... చవితి ... షష్ఠి తిథుల్లోను, ఆదివారం ... మంగళవారం ... శనివారాల్లోను క్షౌరం చేయించుకోరాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక పర్వదినాల్లోను ... మైల సమయాల్లోనూ కూడా క్షౌరం చేయించుకోకూడదని అంటున్నాయి. ఈ సమయాల్లో క్షౌరం చేయించుకోవడం వలన ఆయువు క్షీణిస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.