శ్రీవారి వాహనాలు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, ఆయన వివిధ వాహనాలపై ఊరేగుతుండటాన్ని కనులారా తిలకించి మనసారా తరించాలని ఆరాటపడుతుంటారు. తిరుమల మాడ వీధులలో ఘనంగా ... మనోహరంగా ఊరేగుతూ ఆయన భక్తుల కోరికను తీరుస్తుంటాడు.
బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీదేవి - భూదేవితో కలిసి 'పెద్ద శేషవాహనం' పై ... మేరు పచ్చను ధరించి 'చిన్న శేషవాహనం' పై ... వీణా పాణిగా 'హంస వాహనం' పై ... నృసింహ అవతార తత్త్వాన్ని చాటే 'సింహ వాహనం' పై ... శ్రీదేవి - భూదేవిల ముంగిట ముత్యమై 'ముత్యాల పందిరి వాహనం' పై కనువిందు చేస్తుంటాడు.
ఇక కోరికలు నెరవేర్చు కొండంత దైవమై 'కల్పవృక్ష వాహనం' పై ... ఇంద్రాది దేవతలకు రక్షకుడిగా 'సర్వభూపాల వాహనం' పై ... స్వర్ణ పతక హారాలను ధరించి 'గరుడవాహనం' పై ... రఘురాముడిగా 'హనుమద్వాహనం' పై ... శరణాగత వత్సలుడిగా 'గజవాహనం' పై ... కల్కి అవతారంలోని అంతరార్థాన్ని ప్రభోదిస్తూ 'అశ్వ వాహనం' పై ఊరేగుతూ ఆనందాన్ని కలిగిస్తుంటాడు.
సూర్యుడికి అధిష్టాన దైవంగా 'సూర్యప్రభ వాహనం' పై ... నిర్మలమైన భక్తిని కోరుతూ 'చంద్రప్రభ వాహనం' పై ఊరేగుతూ ఉంటాడు. ఇక శరీరమనే రథాన్ని ... సారథియగు బుద్ధిని సన్మార్గంలో నడిపించి గమ్యస్థానం చేరుకోమనే విషయాన్ని తెలియజెపుతూ, స్వామివారి 'రథోత్సవం' అంగరంగ వైభవంగా జరుగుతుంది.