శ్రీ వేదనారాయణ క్షేత్రం
వేదాలను అపహరించిన సోమకాసురుడనే రాక్షసుడిని సంహరించి, ఆ వేదాలను తిరిగి బ్రహ్మకు అప్పగించాడు శ్రీమన్నారాయణుడు. ఈ కారణంగానే ఆయన వేదనారాయణుడిగా ఇంద్రాది దేవతలచే పూజలందుకున్నాడు. వేదాలను రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు 'మత్స్యావతారం' ధరించాడు. దశావతారాలలో ఇదే మొట్టమొదటి అవతారం. ఈ అవతారంలో ఆవిర్భవించిన శ్రీ మహావిష్ణువు 'వేదనారాయణ స్వామి'గా పూజలందుకుంటోన్న క్షేత్రం చిత్తూరు జిల్లా 'నాగులాపురం'లో దర్శనమిస్తుంది.
శ్రీ వేదవల్లీ సమేతంగా వేదనారాయణ స్వామి వెలసిన ఈ క్షేత్రంలో, మరో వైపున శివుడు ... బ్రహ్మ కూడా కొలువుదీరి కనిపిస్తారు. త్రిమూర్తులు నెలవైన కారణంగా ఈ క్షేత్రం మరింత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇక విష్ణు నామంతో కనిపించే వినాయకుడుని కూడా భక్తులు విశేషంగా పూజిస్తుంటారు.
ప్రతియేటా రథసప్తమి సమయంలో ఇక్కడి స్వామివారిని మూడు రోజులపాటు సూర్య కిరణాలు తాకుతాయి. మొదటి రోజున వేదనారాయణుడి పాదాలను ... రెండవ రోజున స్వామివారి నాభిని ... మూడవ రోజున స్వామివారి శిరస్సును సూర్య కిరణాలు స్పర్శించి తరిస్తుంటాయి. ఈ విశేషాన్ని వీక్షించడానికి వేల సంఖ్యలో భక్తులు ఇక్కడికి చేరుకుంటారు.
ఇలా స్వామివారిని సూర్యుడు తన కిరణాలతో అలంకరించడాన్ని 'సూర్య పూజోత్సవం' అని అంటారు. ఈ సమయంలో స్వామివారిని దర్శించడం వలన అనారోగ్యాలు తొలగి, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.