ద్వారపూడి అయ్యప్ప
కార్తీక మాసం వచ్చిందంటే చాలు ... ఎక్కడ చూసినా అయ్యప్ప దీక్ష ధరించిన భక్తులు కనిపిస్తుంటారు. మండలంపాటు అయ్యప్ప దీక్షను నియమ నిష్టలతో కొనసాగించి, 'శబరిమల'వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుని దీక్ష విరమిస్తుంటారు. అయితే శబరిమల వెళ్లే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతుండటంతో, స్వామివారి దర్శనానికి రోజులే పడుతుంది.
ఈ నేపథ్యంలో ఆరోగ్య పరంగా ... ఆర్ధిక పరంగా శక్తిలేని వారు, అంత సమయాన్ని కేటాయించలేని అయ్యప్ప భక్తులు శబరిమలైకి బదులుగా రాజమండ్రి సమీపంలోని 'ద్వారపూడి' అయ్యప్ప క్షేత్రానికి వస్తుంటారు. భక్తితో స్వామివారికి 'ఇరుముడులు' సమర్పించుకుంటూ వుంటారు.
ఇక్కడి మణికంఠ స్వామి విగ్రహాన్ని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏకశిల పై 18 మెట్లను చెక్కించి వాటికి బంగారు తాపడం చేశారు. ఇరుముడితో వచ్చిన భక్తులను మాత్రమే ఈ మెట్ల మీదుగా రావడానికి అనుమతిస్తారు. ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం ... భక్తులకుగల ఏర్పాట్ల కారణంగా ఒకప్పటికన్నా ఇప్పుడు వచ్చే వారి సంఖ్య పెరిగింది. శబరిమలలో 'మకరజ్యోతి' కనిపించే రోజున ఇక్కడి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది.
ఇక ఇక్కడి ప్రాంగణంలో అనేక దేవతా మందిరాలు దర్శనమిస్తుంటాయి. వాటిలో శివాలయం ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. జ్యోతిర్లింగాలు గల క్షేత్రాల నుంచి 18 శివలింగాలను సేకరించి నాలుగు అంతస్తుల్లో ప్రతిష్ఠించారు. పై అంతస్తులో చేసిన అభిషేక జలాలు కింది అంతస్తుల్లోని శివలింగాలను సైతం అభిషేకించడం మనసుకు మహదానందాన్ని కలిగిస్తుంది.