ధర్మపురి
శివ కేశవులకు భేదం లేదు ... ఈ విషయాన్ని తెలుసుకుని పూజించిన వారికి అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. సాధారణంగా శైవ క్షేత్రాలకు విష్ణుమూర్తి క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తుండగా, వైష్ణవ క్షేత్రాలకు శివుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తుంటాడు. ఇక కొన్ని క్షేత్రాల్లో ఇద్దరు కలిసే కనిపిస్తుంటారు ... కనువిందు చేస్తూ అనుగ్రహిస్తుంటారు. అలా గోదావరి నదీ తీరంలో శివ కేశవులు కొలువైన క్షేత్రంగా 'ధర్మపురి' కనిపిస్తుంది.
శివకేశవుల కారణంగా అత్యంత శక్తిమంతమైన ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో దర్శనమిస్తుంది. ఇక్కడ శ్రీ రాముడు ప్రతిష్ఠించిన శివలింగం 'రామలింగేశ్వరుడు' గా పూజలు అందుకుంటూ వుండగా, లక్ష్మీ సమేతుడైన నృసింహస్వామి నయన మనోహరంగా దర్శనమిస్తుంటాడు. గోదావరి తీర ప్రాంతాల్లో వెలసిన ప్రాచీన పుణ్య క్షేత్రాలలో 'నాసిక్' ... 'త్రయంబకేశ్వరం' తరువాత స్థానం 'ధర్మపురి'కి లభిస్తుందని చెబుతుంటారు.
బ్రహ్మాండ పురాణం ... స్కంద పురాణం ... పద్మపురాణాల్లో ఈ క్షేత్ర ప్రాశస్త్యం వివరించబడింది. 9 వ శతాబ్దం నుంచే ఈ క్షేత్రం తన ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది. శాతవాహనులు ... చాళుక్యులు ... రాష్ట్ర కూటులు ... కాకతీయులు ఈ క్షేత్ర అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషించినట్టు శాసన ఆధారాలు కనిపిస్తున్నాయి.
ఎన్నో మతపరమైన దాడులను ఎదుర్కుంటూ ... భక్తులచే పునఃనిర్మాణం గావించబడుతూ ఈ క్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలను అడుగడుగునా వెదజల్లుతోంది. ప్రతి ఏటా 'ఫాల్గుణ శుద్ధ ఏకాదశి' రోజు నుంచి ఇక్కడి నృసింహస్వామికి వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. దాదాపు 13 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో బక్తులు తరలి వస్తుంటారు. పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి శివకేశవులను దర్శించి తరిస్తుంటారు.