వ్యాఘ్రపాద క్షేత్రం
సదా నారాయణ నామస్మరణలో మునిగితేలే నారదమహర్షి, భూలోకాన పవిత్రమైన ప్రదేశాల్లో శ్రీమన్నారాయణ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించాడు. ఈ నేపథ్యంలో మనకి జనార్ధన స్వామి క్షేత్రాలు ... భావనారాయణ స్వామి క్షేత్రాలు కనిపిస్తుంటాయి. అలాంటి నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించాడనే విషయం కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు. ఆ విశేషం చోటుచేసుకున్న ప్రదేశమే 'పెదపులి వర్రు'.
ఈ క్షేత్రం గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో దర్శనమిస్తుంది. కాలక్రమంలో నారద మహర్షి ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని వ్యాఘ్రపాద మహర్షి పూజించేవాడు. శివకేశవులకు భేదం లేదని భావించే ఈ మహర్షి, ఒక వైపున శివుడికి పూజాభిషేకాలు నిర్వహిస్తూనే, మరో వైపున 'కంచి'లోని శ్రీ వరదరాజ స్వామి వారికి మానసిక పూజ చేసేవాడు.
ఒక రోజున ఆయన నదీ స్నానానికి వెళ్లి నప్పుడు, అక్కడ వరదరాజ స్వామి విగ్రహం కన్పించింది. స్వామివారి అనుగ్రహం లభించినదుకు ఆనందంతో పొంగిపోతూ ఆయన దానిని తీసుకు వచ్చి శివాలయం పక్కనే మరో ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి ఇది వ్యాఘ్రపాద క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
ఇక సంక్రాంతి రోజు ఉదయం వేళ సూర్య కిరణాలు శివుడి ఫాల భాగాన ... సాయంత్ర వేళ సూర్య కాంతులు వరదరాజ స్వామి పాదాల చెంత పడటం ఇక్కడి విశేషంగా చెప్పుకుంటూ వుంటారు. ఈ విశేషాన్ని కనులారా తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడకి చేరుకుంటారు.