లక్ష్మీ అనుగ్రహం
ప్రతి ఒక్కరూ ప్రతి పూజలోను ఆయురారోగ్యాలు ... సుఖ సంతోషాలను ఇవ్వమని దైవాన్ని ప్రార్ధిస్తుంటారు. అయితే అవసరాలు తీరినప్పుడే ఎవరైనా ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఇక అవసరాలు తీరాలంటే ధనం కావాలి ... ఆ ధనం లభించాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలి. ఈ కారణంగానే లక్ష్మీదేవిని అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు.
లక్ష్మీదేవి పూజ మొక్కుబడిగా చేస్తే లభించే ఫలితం కూడా అంతే వుంటుంది. అదే ఆమె మనసెరిగి చేసే పూజ వలన సత్వర ఫలితం వుంటుంది. అలాంటి ఫలితాలను ఆశించే వారు, ప్రతి శుక్రవారం 'కనకధారా స్తవం' పఠించాలి. ఆవునెయ్యి తోను ... కొబ్బరి నీళ్ళతోను లక్ష్మీదేవిని అభిషేకించాలి.
సువాసనతో కూడిన తెల్లని పూలతో అమ్మవారిని పూజించాలి. రావిచెట్టు బెరడుతో అమ్మవారికి ధూపం వేయాలి. ఇక శుక్రవారం రోజున అమ్మవారికి పెరుగన్నం నైవేద్యంగా సమర్పించ వలసి వుంటుంది. ఈ విధంగా అమ్మవారిని ఆరాధించిన వారిపై ఆమె కరుణా కటాక్షాలు ప్రసరిస్తాయి ... సకల సంపదలు సత్వరమే కలుగుతాయి.